దొరికిన సొమ్ము రూ.700 కోట్లు : ఆల్ టై రికార్డ్

దొరికిన సొమ్ము రూ.700 కోట్లు : ఆల్ టై రికార్డ్

అక్టోబర్‌ 9 నుంచి నవంబర్‌ 25 మధ్య రూ.709కోట్ల 56లక్షల 12వేల 177 విలువైన నగదు, ఉచిత వస్తువులు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం నవంబర్ 26న వెల్లడించింది. నవంబర్ 25న ఒక్కరోజే పట్టుబడిన నగదు దాదాపు రూ.10 కోట్లుగా వివరించింది. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 25 మధ్య ఎన్నికల అధికారులు రూ.282.75 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. శనివారం ఒక్కరోజే రూ.3కోట్ల 92లక్షల 72వేల 369 విలువైన దాదాపు 5వేల 117 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలోనే పట్టుబడిన మొత్తం మద్యం (2,40,956 లీటర్లు) విలువ రూ.117కోట్ల 86లక్షల 87వేల 511.

వీటితో పాటు 51,315 కిలోల నల్లబెల్లం, 3,404 కిలోల 113.5 లీటర్ల పటిక, కందిపప్పును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదు, ఉచితాలకు తోడు శనివారం ఒక్కరోజే దాదాపు 639.5 కిలోల గంజాయి, రూ.1.60 కోట్ల విలువైన 1.30 కిలోల ఎన్‌డీపీఎస్‌ను స్వాధీనం చేసుకున్నారు. అక్టోబరు 9- నవంబర్ 25 మధ్య కాలంలో పట్టుబడిన డ్రగ్స్ మొత్తం విలువ రూ.39కోట్ల 48లక్షల 2వేల 714.

చీరలు, నిత్యావసర వస్తువులు

శనివారం ఒక్కరోజే 34లక్షల 71వేల 850 చీరలతో రూ.83కోట్ల 8లక్షల 69వేల 146 విలువైన ఉచితాలను పోలీసులు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 2లక్షల 96వేల 595 కిలోల బియ్యం, 9వేల 207 కుక్కర్లు, 88వేల 797 చీరలు, 7 ద్విచక్ర వాహనాలు, 10 నాలుగు చక్రాల వాహనాలు, 18వేల 566 గడియారాలు, 72వేల 473 మొబైల్‌లు, 6వేల 313 ఫ్యాన్లు, 151 కుట్టు మిషన్లు, 362 లంచ్ బాక్సులు, 15వేల 858 ఇమిటేషన్ జ్యువెల్లరీ, లక్షా 41వేల 478 వస్త్రాలు, 3,854 టీ-షర్టులు, 40 టెలివిజన్ సెట్‌లు లాంటివి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.