పద్మారావు నగర్/కుషాయిగూడ, వెలుగు: ఓఆర్‌ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ మిమిక్రీ, వెంట్రిలాక్విజం, మ్యాజిక్ కళాకారుడు సత్యనారాయణ (40) కన్నుమూశారు. ఆదివారం రాత్రి బతుకమ్మ వేడుకల్లో ప్రదర్శన ముగించుకుని హకీంపేట నుంచి హయత్‌నగర్ వైపు కారులో ఓఆర్ఆర్పై వెళ్తుండగా వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.
కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. గమనించే వారు లేకపోవడంతో కారులోనే ఆయన ప్రాణాలు విడిచారు. 15 ఏండ్లుగా, మిమిక్రీ, మ్యాజిక్ రంగాల్లో 2 వేలకు పైగా ప్రదర్శనలిచ్చిన సత్యనారాయణ మృతిపై తెలంగాణ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు సామల వేణు, కళాకారుల దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు.
