టోలిచౌకిలో అగ్నిప్రమాదం.. ఫర్నిచర్ గోదాంలో ఎగిసిపడుతున్న మంటలు

టోలిచౌకిలో అగ్నిప్రమాదం.. ఫర్నిచర్ గోదాంలో ఎగిసిపడుతున్న మంటలు

హైదరాబాద్‌లోని టోలిచౌకి దత్తాత్రేయ నగర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సయీద్ అలీకి చెందిన ఫర్నిచర్ గోదాంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం, ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు తెలియాల్సి ఉంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చిన తర్వాతే ప్రమాద తీవ్రతపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.