ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ‘90’s వెబ్ సిరీస్’ ఫేమ్ ఆదిత్య హాసన్ తెరకెక్కించిన చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. బుధవారం ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో హీరో ఆనంద్ మాట్లాడుతూ ‘దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు నా కథ నాకే చెప్పాడేమో అనిపించింది. నేను కూడా విదేశాల్లో చదువుకోవడంతో చాలా సీన్స్‌కు కనెక్ట్ అయ్యాను.
ఇందులోని లవ్, రిలేషన్, ఫ్యామిలీ, ఎమోషన్స్ లాంటివన్నీ ప్రతి ఒక్కరి మనసుకు నచ్చుతాయి. వరుస విజయాలతో దూసుకెళుతున్న సితార బ్యానర్‌లో మరో హిట్ చేరబోతోంది’ అని చెప్పాడు. కథానాయిక వైష్ణవి చైతన్య మాట్లాడుతూ ‘నా మనసుకి దగ్గరైన సినిమా ఇది. ఈ అందమైన ప్రేమకథలో మనల్ని మనం చూసుకుంటున్నట్టు అనిపిస్తుంది. చూస్తున్నంతసేపు ఫ్రెండ్స్ గుర్తొస్తారు’ అని చెప్పింది.
దర్శకుడు ఆదిత్య హాసన్ మాట్లాడుతూ ‘ఇది ప్రతి ఒక్కరికీ చేరువయ్యే ప్రేమకథ. బంధాలను, భావోద్వేగాలను గొప్పగా చూపించాం. కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రం’ అని చెప్పాడు.

