
తెలంగాణ వైద్య రంగం దేశానికే ఆదర్శంగా ఉందన్నారు హెల్త్ మినిస్టర్ హరీశ్ రావు. ఒమిక్రాన్ పై అలర్ట్ గా ఉన్నామన్నారు. 18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేసుకోవాలని సూచించారు. ప్రజలంతా తప్పనిసరిగా కరోనా రూల్స్ పాటించాల్సిందేనన్నారు. కేంద్రం నుంచి అనుమతి వస్తే మూడో డోస్ వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు హరీశ్.