ఉప్పల్, వెలుగు: రెండు నెలల్లో రిటైర్మెంట్ కానున్న ఓయూ డీఈ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఓయూ బిల్డింగ్ డివిజన్ సిటీ రేంజ్యూనిట్లో రాకొండ శ్రీనివాసులు డిప్యూటీ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. మానేరు బాయ్స్ హాస్టల్ పునరుద్ధరణ పనులకు సంబంధించి కాంట్రాక్టర్‌కు రూ.14 లక్షల బిల్లు రావాల్సి ఉంది.
ఇందులో సగం వరకు బిల్లు విడుదల చేయాల్సి ఉండగా, డీఈ శ్రీనివాసులు రూ.11 వేలు డిమాండ్ చేశాడు. సదరు కాంట్రాక్టర్ రూ.5 వేలు బదిలీ చేశాడు. మిగతా రూ.6 వేలు కూడా ఇవ్వాలని కాంట్రాక్టర్‌ను డీఈ ఒత్తిడి చేశాడు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు. మంగళవారం రూ.6 వేలు డీఈ శ్రీనివాసులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు.
