శిల్పా శెట్టి & రాజ్ కుంద్రాపై 420 కేసు.. రూ.60 కోట్ల మోసంపై ED విచారించే ఛాన్స్..

శిల్పా శెట్టి & రాజ్ కుంద్రాపై 420 కేసు.. రూ.60 కోట్ల మోసంపై ED విచారించే ఛాన్స్..

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా మరోసారి చిక్కుల్లో పడ్డారు. వీరిద్దరూ కలిసి ఒక వ్యాపారవేత్తను మోసం చేశారనే ఆరోపణలపై ముంబై ఆర్థిక నేరాల విభాగం (EOW) సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసింది.

 ఏం జరిగిందంటే : దీపక్ కొఠారీ అనే వ్యాపారవేత్త ఫిర్యాదు ప్రకారం.. 2015 నుండి 2023 మధ్య కాలంలో శిల్పా శెట్టి, రాజ్‌ కుంద్రా కలిసి   'బెస్ట్ డీల్ టీవీ' అనే కంపెనీలో పెట్టుబడి పెట్టాలని ఆయనను కోరారు. దాదాపు రూ. 60 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టించారు. అయితే, ఆ డబ్బును వ్యాపారం కోసం వాడకుండా, వారి సొంత అవసరాలకు వాడుకున్నారని ఆయన ఆరోపించారు.
 
 పోలీసులు సేకరించిన సాక్ష్యాలు, ఎలక్ట్రానిక్ ఆధారాలను బట్టి శిల్పా,రాజ్‌ కుంద్రా  దంపతులు మోసానికి పాల్పడినట్లు ప్రాథమికంగా తేలిందని బాధితుడి న్యాయవాది తెలిపారు. ఇదొక మోసం కేసు (IPC 420) కాబట్టి, ఇప్పుడు ఈ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా విచారించే అవకాశం ఉంది.

విదేశీ ప్రయాణంపై ఆంక్షలు: అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూడటానికి లండన్ వెళ్లాలని ఈ జంట కోర్టును కోరింది. అయితే, రూ. 60 కోట్లు డిపాజిట్ లేదా లేదా బ్యాంక్ గ్యారెంటీ చేస్తేనే అనుమతిస్తామని కోర్టు స్పష్టం చేసింది.

IPC సెక్షన్ 420 అంటే ఏంటి?
 ఎవరినైనా నమ్మించి మోసం చేయడం లేదా అబద్ధాలు చెప్పి డబ్బులు/ఆస్తులు లాక్కోవడం. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే  గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు.