విష్ణుమూర్తికి ప్రీతికరమైన ధనుర్మాసంలో భూదేవి అవతారమైన ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధం 'తిరుప్పావై'ని చదవడం ఆనవాయితీ. తిరు అంటే పవిత్రమైన, పావై అంటే వ్రతం అని అర్థం. ధనుర్మాసంలో రెండో రోజు పఠించాల్సిన పాశురం తెలుసుకుందాం. .
వైయత్తు వాళ్ వీర్ గళ్! నాముమ్ నమ్బావైక్కు
శేయ్యుం కిరిశైగళ్ కేళీరో, పాఱ్కడలుళ్
పైయ త్తుయిన్ఱ పరమనడిపాడి
నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోమ్ మలరిట్టు నామ్
ముడియోమ్
శెయ్యాదన శెయ్యోమ్ తీక్కుఱళైచ్చెన్జోదోమ్
ఐయముమ్ పిచ్చెయుంఆన్దనై యుంకైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్.
భావము : భూలోకంలోని గోకులంలో పుట్టిన భాగ్యవతులారా! మనం చేయబోయే వ్రతానికి ముఖ్యంగా ఆచరించాల్సిన విషయాలేంటో వినండి. శ్రీమన్నారాయణుని పాదాలకు నమస్కరించుకుంటాం. ఆయనను పూజించుకుంటున్న సమయానికి ఎలాంటి ఇతర భోగ విషయాలను తల్చుకోము. పాలు కూడా తాగము. కళ్లకు కాటుక పెట్టుకోము. నెయ్యితో చేసినవేవీ తినము. సిగలో పూలు పెట్టుకోము. అంటే శాస్త్ర విరుద్ధమైన పనులేవీచేయము. ఒకరిపై చాడీలు చెప్పము. సన్యాసులకు, బ్రహ్మచారులకు దాన ధర్మాలు చేద్దాం. ఇతరులకు సహాయపడే పనులేవైనా ఉంటే అవన్నీ కూడా చేద్దాం.ధనుర్మాస మాసంలో ఈ పనులన్నీ చేస్తూ శ్రీమన్నారాయణుని స్మరించుకుందాం. ఇదే మన వ్రతం.
తిరుప్పావై రెండవ పాశురం.. ఆండాళ్ ( గోదాదేవి) తన స్నేహితురాళ్లను లేపి, గోపికలందరూ తెల్లవారుజామున లేచి, పాలు పితికేందుకు, పెరుగు తోడేసి, వెన్న తీయడానికి సిద్ధం కావాలని, భగవంతుని స్తుతించేందుకు పవిత్ర స్నానం చేయాలని, పెరుమాళ్‌ను కీర్తించాలని కోరుతూ ఉంటుంది. ఇది ధనుర్మాసంలో పఠించే ఒక ముఖ్యమైన పాశురం, దీనిని పఠించడం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుందని నమ్మకం.
