సంక్రాంతికి బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ మరిన్ని పరిశ్రమలు..ఫుడ్ పార్క్ పురోగతిపై మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల సమీక్ష

సంక్రాంతికి బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ మరిన్ని పరిశ్రమలు..ఫుడ్ పార్క్ పురోగతిపై మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల సమీక్ష
  • రూ.615 కోట్లు పెట్టుబడులు పెట్టనున్న దీపక్ నెక్స్ జెన్ గ్రూప్

ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయ రంగంలో బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ గేమ్ చేంజర్ గా మారనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మం గళవారం సెక్రటేరియట్ లో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తో కలిసి ఫుడ్ పార్క్ పురోగ తిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఫుడ్ పార్క్ కుసంబంధించిన పూర్తి వివరాలను అధికారులు వివరించారు. మొత్తం ఫుడ్ పార్క్ ప్రాజెక్ట్ ఖర్చు రూ.109 కోట్లు కాగా, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసిం గ్ నుంచి రూ.28 కోట్లు గ్రాంట్ ఇచ్చారు. 

ప్రస్తు తం 26 ఎకరాల్లో 26 ప్లాట్స్ లో పలు కంపెనీల కు ప్లాట్స్ కేటాయించారు. గొర్లాస్ గ్రీన్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్ఫినిటీ ఇండస్ట్రీస్ లకు ప్లాట్స్ కేటాయించారు.తాజాగా దీపక్ నెక్స్ జెన్ ఆక్వా ప్రాజెక్ట్ కు స్థలం కేటాయించారు. దీపక్ నెక్స్ జెన్ రూ.615 కోట్ల పెట్టుబడులతో 3200 మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని తెలిపారు. గత ప్రభుత్వంలో పడావు పడ్డ ఫుడ్ పార్క్.. 2016 లో అప్పటి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఫుడ్ పార్క్ కు శంకుస్థాపన చేశారు. 

తొమ్మిదేండ్లు పూర్తయినా బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు మొదలుకాలేదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరాక బుగ్గపాడు ఫుడ్ పార్క్ పనుల పు రోగతిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగే శ్వరరావు ప్రత్యేక దృష్టి సారించారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి రెండు దఫాలు సమీక్ష నిర్వహించారు. 

మంగళవారం జరిగిన సమావేశంలో అనుమతులు వేగవంతం చేసి, సంక్రాంతికి ఫుడ్ పార్క్ ప్రారంభం చేయాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. రోడ్డు, రైల్వే, పోర్ట్ కనెక్టివిటీ ఉండేలా స్ట్రాటజిక్ లొకేషన్ గా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో మెగా ఫుడ్ పార్క్ క్కు అప్పట్లో మంత్రి తుమ్మల రూపకల్పన చేశారు. 150 కిలోమీటర్ల పరిధిలో వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా, పౌల్ట్రీ లభ్యత ఉంది. 

కనెక్టివిటీ దృష్ట్యా, స్ట్రాటజిక్ లొకేషన్ లో మెగాఫుడ్ కోర్ట్ ఏర్పాటుతో ఖమ్మం జిల్లాతో పాటు చుట్టు ఉన్న జిల్లాలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని మంత్రి తుమ్మల అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఇం డస్ట్రీస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, టీజీఐఐసీ వైస్ ఛైర్మన్, ఎండీ శశాంక, కమిష నర్ ఇండస్ట్రీస్ నిఖిల్ చక్రవర్తి, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డైరెక్టర్ ఆఫ్ బిజినెస్ సుష్మ, టీజీఐఐసీ ఈడీ పవన్ కుమార్. ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సభ్యులు శ్రీరామ్, ఆర్లిన్ పాల్గొన్నారు.