ఆపిల్‌ను మించిన చైనీస్ సూపర్ ఫ్రూట్.. షుగర్ పేషెంట్లకు గొప్ప వరం.. తింటే ఎన్ని లాభాలో

ఆపిల్‌ను మించిన చైనీస్  సూపర్ ఫ్రూట్.. షుగర్ పేషెంట్లకు గొప్ప వరం.. తింటే ఎన్ని లాభాలో

ఆపిల్‌ పండ్ల టైం ముగిసిపోతోందా..? భారతీయ పండ్ల మార్కెట్‌లోకి ఒక కొత్త 'సూపర్ ఫ్రూట్' వచ్చి చేరింది. అదే పర్సిమన్ (Persimmon) పండు. చూడటానికి ఆకర్షణీయంగా, తినడానికి రసవంతంగా ఉండే ఈ పండు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు చైనాకే పరిమితమైన ఈ పండు, ఇప్పుడు మన దేశంలో అందరి ఫేవరెట్‌గా మారుతోంది. దీని రుచి, ఆరోగ్య ప్రయోజనాల వల్ల అటు ప్రజలు, ఇటు రైతులు దీనిపై ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.

 వేగంగా పెరుగుతున్న సాగు
గడిచిన రెండేళ్లలోనే ఈ పండు సాగు ఊహించని స్థాయిలో పెరిగింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లు జిల్లాలో దీని సాగు 200 హెక్టార్ల నుండి ఏకంగా 400 హెక్టార్లకు పెరిగి, రెట్టింపు అయ్యింది. ఈ ఏడాది దాదాపు 1,400 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. కేవలం హిమాచల్ మాత్రమే కాకుండా, జమ్మూ-కాశ్మీర్, ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా రైతులు పర్సిమన్ తోటల వైపు మొగ్గు చూపుతున్నారు.

యాపిల్స్ బదులు పర్సిమన్ ఎందుకు 
మారుతున్న వాతావరణం వల్ల యాపిల్ సాగు కష్టతరంగా మారుతోంది. వేడి పెరగడం వల్ల హిమాలయ ప్రాంతాల్లో యాపిల్ దిగుబడి 50% వరకు పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పర్సిమన్ పంట రైతులకు వరంగా మారింది. దీనికి తక్కువ చలి ఉన్నా సరిపోతుంది ఇంకా పురుగుమందుల వాడకం చాలా తక్కువ. అలాగే వాతావరణ మార్పులను తట్టుకునే శక్తి వీటికి ఎక్కువ. అందుకే భవిష్యత్తులో పర్సిమన్  పండ్లు యాపిల్‌కు ప్రత్యామ్నాయంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.

రైతులకు కాసుల వర్షం
పర్సిమన్ సాగు కేవలం ఆరోగ్యం కోసమే కాదు, ఆదాయం కోసం కూడా చాలా మేలైనది. మార్కెట్‌లో ప్రస్తుతం యాపిల్ ధరతో పోలిస్తే పర్సిమన్ పండ్లు దాదాపు రెట్టింపు ధరకు అమ్ముడవుతున్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తుండటంతో, రైతులు దీనిని ఒక బంగారు గనిలా భావిస్తున్నారు.

అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
ఆరోగ్యంపై శ్రద్ధ చూపే వారు ఈ పండును ఎందుకు ఇష్టపడుతున్నారో తెలుసా.... ఇందులో విటమిన్-సి, విటమిన్-ఎ వంటి విటమిన్లు  పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలోని కణాలు(యాంటీఆక్సిడెంట్లు) దెబ్బతినకుండా కాపాడతాయి.

►ALSO READ | ఎండాకాలంలో మీ శరీరం ఏసీలా మారాల.. ఈ 10 అద్భుతమైన ఆహారాలను అస్సలు వదలకండి!

యాపిల్ కంటే ఇందులో రెట్టింపు పీచు పదార్థం (ఫైబర్) ఉంటుంది, ఇది జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

 ఈ పండు తీపిగా ఉన్న.. రక్తంలో చక్కెర స్థాయిని (Glycemic index) వేగంగా పెంచదు. అందుకే డయాబెటిస్ ఉన్నవారు కూడా భయం లేకుండా ఈ పండును తినవచ్చు. రుచికరమైన తీపితో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ చైనీస్ సూపర్ ఫ్రూట్, ఇప్పుడు మన భారతీయ పండ్ల మార్కెట్‌లో రారాజుగా మారుతోంది!