చేపలు తిని అవయవాలు కోల్పోయింది

చేపలు తిని అవయవాలు కోల్పోయింది

కాలిఫోర్నియాలో ఓ మహిళ తన నాలుగు అవయవాలను కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రాణాంతకమైన బ్యాక్టీరియా జాతితో కలుషితమైన టిలాపియా చేపలను తినడం వల్ల ఆమెకు ఈ పరిస్థితి వచ్చిందని పలు నివేదికలు తెలిపాయి. చేపలను తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడకబెట్టడంతో.. ఆ బ్యాక్టీరియా చనిపోలేదని, దీని వల్ల ఆమెకు ఆ బ్యాక్టీరియా సోకిందని వివరించాయి.

లారా బెరాజస్ (40 ఏళ్లు) అనే మహిళ కొన్ని రోజుల క్రితం స్థానిక మార్కెట్ నుంచి టిలాపియా చేపలను కొనుగోలు చేసింది. ఆ తర్వాత తానే చేపల కూర వండి, ఎంతో ఇష్టంగా తినింది. కానీ.. ఆ చేపలు తిన్న వెంటనే బెరాజస్ తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఒక్కసారిగా ఆమె కుప్పకూలింది. దీంతో.. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పట్నుంచి ఆమె ఆసుపత్రికే పరిమితం అయ్యింది. ఈ క్రమంలో ఆమె శరీరంలో నాలుగు అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నాయని గ్రహించిన వైద్యులు.. ఇటీవలే సర్జరీ చేసి, వాటిని తొలగించారు. ఈ పరిస్థితికి గల కారణాలేంటని వైద్యులు పరిశీలించగా.. అప్పుడు అసలు నిజం వెలుగులోకి వచ్చింది. టిలాపియా చేపలను తినడం వల్లే ఆమె ఆరోగ్యం ఇంతలా క్షీణించిందని వైద్యులు గుర్తించారు.

ఈ చేపల్లో ఉన్న విబ్రియో వల్నిఫికస్‌ అనే ప్రాణాంతకమైన బ్యాక్టీరియా సముద్రపు నీళ్లు, రా సీఫుడ్స్‌లలో ఉంటుంది. దీని బారిన పడకుండా ఉండాలంటే.. సీఫుడ్స్‌ని శుభ్రం చేసి, బాగా ఉడకబెట్టి తినాల్సి ఉంటుంది. అలా కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. కావున సీఫుడ్స్‌ని వడ్డించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  బాగా ఉడికించిన తర్వాతే తీసుకోవడం చాలా ఉత్తమం.

కాలిఫోర్నియాలో ఓ మహిళ చేపలు తిని, నాలుగు అవయవాలను కోల్పోయింది. నిజానికి ఆమె తిన్న టిలాపియా చేపలు మంచివే.. కానీ అందులో ప్రాణాంతకమైన బ్యాక్టీరియా ఉండడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని వైద్యులు తెలిపారు. వాటిని సరిగ్గా ఉడికించకపోవడం వల్లే లారా బెరాజస్ అనే మహిళ తన నాలుగు అవయవాలను కోల్పోవాల్సి వచ్చిందని చెప్పారు. దీని వల్ల ఆమె కొంతకాలం కోమాలోకి వెళ్లిందని, వేళ్లు, పెదవులు నల్లగా మారాయని, మూత్రపిండాలు కూడా చెడిపోయాయని అన్నారు.