టిబిలీసి: జార్జియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. తుర్కియే మిలటరీకి చెందిన సీ-130 కార్గో విమానం గాల్లో ఉండగా మంటలు అంటుకుని పశ్చిమ జార్జియాలోని ఓ పర్వత ప్రాంతంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో ప్లైన్ లో సిబ్బంది సహా మొత్తం 20 మంది ఉన్నట్లు తెలుస్తోంది.
ఘటనలో వీరంతా మరణించే ఉంటారని సమాచారం. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీ-130 ఎయిర్ క్రాఫ్ట్ అజర్ బైజాన్ నుంచి తుర్కియేకి వెళ్లేందుకు టేకాఫ్ అయ్యిందని అధికారులు తెలిపారు. గాల్లోకి లేచిన కాసేపటికే మంటలు అంటుకుని అజర్ బైజాన్, జార్జియా దేశాల బార్డర్ లో ప్లేన్ గింగిరాలు తిరుగుతూ నేల కూలిందన్నారు.
