తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుకుందాం : అల్లం నారాయణ

తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుకుందాం :  అల్లం నారాయణ
  • ఆంధ్రా పార్టీలకు తెలంగాణలో పనేంటి?
  • టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ 

జీడిమెట్ల, వెలుగు: తెలంగాణ అస్థిత్వాన్ని, సంస్కృతిని కాపాడుకోవడానికి జర్నలిస్టులు సిద్ధంగా ఉండాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు, ప్రెస్​అకాడమీ మాజీ చైర్మన్​అల్లం నారాయణ సూచించారు. సూరారంలో శుక్రవారం నిర్వహించిన సంఘం కుత్బుల్లాపూర్ నూతన కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నాటి తెలంగాణ జాయింట్​ఫోర్స్(టీజేఎఫ్) ఉద్యమ స్ఫూర్తిని మరోసారి చూపించాల్సిన అవసరం వచ్చిందన్నారు.  తెలంగాణలో ఆంధ్రా పార్టీలకు పనేంటని ప్రశ్నించారు.

మళ్లీ అక్కడి సంస్కృతిని ఇక్కడ రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టులు ఐక్యంగా ఉండి, కుట్రలను తిప్పికొట్టాలని కోరారు. అనంతరం తెలంగాణ ఎలక్ట్రానిక్​ మీడియా జర్నలిస్ట్స్​యూనియన్ కుత్బుల్లాపూర్​కన్వీనర్​గా ఎర్రోళ్ల కృష్ణ, కోకన్వీనర్​గా ఉదయ్​కుమార్​ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతిసాగర్​, ఎర్రోళ్ల బాబు తదితరులు పాల్గొన్నారు.