పంటల కొనుగోళ్లకు అనుమతివ్వండి..కేంద్రమంత్రి శివరాజ్సింగ్‌‌‌‌ను కోరిన మంత్రి తుమ్మల

పంటల కొనుగోళ్లకు అనుమతివ్వండి..కేంద్రమంత్రి శివరాజ్సింగ్‌‌‌‌ను కోరిన మంత్రి తుమ్మల

హైదరాబాద్, వెలుగు: యాసంగి సీజన్ పంటలను కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే అనుమతులు మంజూరు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఆయన లేఖ రాయడంతో పాటు ఫోన్‌‌‌‌లో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పంట కొనుగోళ్లకు మార్క్‌‌‌‌ఫెడ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని మంత్రి తెలిపారు.

 పప్పుశనగలకు 45, పొద్దుతిరుగుడుకు 20, మినుములకు 10, వేరుశనగలకు 5 చొప్పున కేంద్రాలను ఇప్పటికే సిద్ధం చేసినట్టు చెప్పారు. మార్కెట్లకు పంట రాక మొదలైందని, ప్రైస్ సపోర్ట్ స్కీమ్ (పీఎస్ఎస్) కింద కొనుగోళ్లు త్వరగా ప్రారంభిస్తే రైతులు తక్కువ ధరకు అమ్ముకోకుండా అడ్డుకోవచ్చని పేర్కొన్నారు. మంత్రి తుమ్మల విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రం పంపిన ప్రతిపాదనలను పరిశీలించి, త్వరలోనే అనుమతులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.