ఫ్లెక్సీ సరిచేస్తుండగా షాక్.. వ్యక్తి మృతి

ఫ్లెక్సీ సరిచేస్తుండగా షాక్.. వ్యక్తి మృతి
  • గణేశ్ ఉత్సవాల్లో విషాదం
  • పాతబస్తీ ఫలక్ నుమాలో ఘటన

ఎల్బీనగర్, వెలుగు: గణేశ్ ఉత్సవాల సందర్భంగా బ్యానర్​ను సరిచేస్తూ ఓ వ్యక్తి కరెంట్​షాక్​తో ప్రాణాలు కోల్పోయాడు. ఫలక్​ నుమా రవీందర్ నాయక్ కాలనీకి చెందిన భరత్ నాయక్ (33) ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్ ను భవనం పైకి ఎక్కి ఐరన్ రాడ్ తో సరిచేస్తుండగా, ప్రమాదవశాత్తు11 కేవీ హైటెన్షన్ వైర్లు తగిలి మృతి చెందాడు. భరత్ నాయక్ కు భార్య సంగీత, ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉండగా, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానిక కాలనీ వాసులు ఫలక్ నుమా విద్యుత్ సబ్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.

మరోచోట కూలీ మృతి

గచ్చిబౌలి : విద్యుత్ షాక్ తో ఓ కూలీ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఎండీ.గౌస్(25) రెండు నెలల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు. హఫీజ్ పేట్​లో ఉంటూ కొండాపూర్ మారుతినగర్ లో నిర్మాణంలోని ఇంట్లో గ్లాస్​అమర్చే పనులు చేస్తున్నాడు.

 శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో అల్యూమీనియం ఫ్యాబ్రికేషన్ చేస్తుండగా ఇనుప పైపు భవనం పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో షాక్ కొట్టి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. బాధితుడిని ఓ ప్రైవేట్​హాస్పిటల్​కు తరలించగా చికిత్స పొందుతూ రాత్రి 10 గంటల మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు
 పేర్కొన్నారు.