తగ్గుతున్న కరోనా.. పెరుగుతున్న అవయవదానాలు

తగ్గుతున్న కరోనా.. పెరుగుతున్న అవయవదానాలు
  • జీవన్ ధాన్ కింద వెయ్యి మంది డొనర్స్ అవయవదానం
  • కరోనాతో రెండేళ్లుగా తగ్గిన ఆర్గాన్ డొనేషన్
  • 2020లో అవయవదానం చేసిన 75 మంది 
  • 2013 నుంచి పెరుగుతూ వచ్చిన ఆర్గాన్ డొనేషన్
  • 2013లో 41 మంది, గతేడాది 162 మంది డొనేషన్
  • 1526-కిడ్నీ, 932-లివర్, 142-హార్ట్, 137-ఊపిరితిత్తుల మార్పిడి 
  • పదేళ్లలో 3802 ఆర్గాన్ డొనేషన్స్  
  • అవయవాల మార్పిడి కోసం బాధితుల ఎదురుచూపు
  • కరోనాతో పెరిగిన లంగ్ ట్రాన్స్ ప్లాంటేషన్స్ 
  • డొనేషన్స్ కు ముందుకు రాని బ్రెయిన్ డెడ్ పేషెంట్స్
  • వృథాగా పోతున్న బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలు

కరోనా కారణంగా రెండేళ్లుగా అవయవ దానం కార్యక్రమం నడవడం లేదు. ప్రస్తుతం కరోనా ప్రభావం పూర్తిగా తగ్గడంతో.. అవయవదానం చేస్తున్న వారి సంఖ్య ఇప్పుడు పెరుగుతోంది. ఒకరు పోతూ.. పదిమందికి ప్రాణం ఇవ్వొచ్చనే ఆలోచన జనంలో పెరుగుతోంది. గుండె, కిడ్నీ, లివర్.. లాంటి అవయవాల మార్పిడి ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ జీవన్ ధాన్ కింద వెయ్యి మంది బ్రెయిన్ డెడ్ పేషంట్స్.. తమ అవయవాలను దానం చేశారు. 2013లో ప్రారంభమైన జీవన్ ధాన్.. NGO అవయవదానంపై అవగాహన పెంచుతోంది. పదేళ్ల క్రితం.. దీనిపై అవగాహన లేపోవడంతో.. ఎవరూ అవయవదానానికి ముందుకు వచ్చేవారు కాదు. కానీ.. ఏడాదికేడాది అవేర్నెస్ పెరగడంతో.. డోనర్స్ సంఖ్య పెరుగుతోంది. పదేళ్లనుంచి ఇప్పటి వరకూ జీవన్ ధాన్ కింద వెయ్యి మంది డొనర్స్ అవయవదానం చేశారు. కరోనా కారణంగా రెండేళ్లుగా ఆర్గాన్ డొనేషన్ బాగా తగ్గింది. లాక్ డౌన్ లో హాస్పిటల్స్ క్లోజ్ అవ్వడం, యాక్సిడెంట్స్ తగ్గడం, పేషంట్స్ కరోనా భయంతో ముందుకు రాకపోవడం లాంటి కారణాలతో.. అవయవదానాలు జరగలేదు. 2019 తో పోల్చితే 2020 లో డోనర్స్ సంఖ్య సగానికి సగం తగ్గింది. 2020లో కేవలం 75 మంది అవయవదానం చేశారు. ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గడంతో అవయవదానాలు పెరుగుతున్నాయి.  

ఆర్గాన్ డొనేషన్ 2013 నుంచి పెరుగుతూ వచ్చింది. 2013లో కేవలం 41 మంది డొనేట్ చేయగా, గత ఏడాది 162 మంది డొనేట్ చేశారు. ఇక ఇప్పటి వరకూ 1526 కిడ్నీ, 932 లివర్, 142 హార్ట్, 137 ఊపిరితిత్తులు లాంటి అవయవాల మార్పిడి జరిగింది. గత పదేళ్లలో మొత్తం 3802 ఆర్గాన్ డొనేషన్స్  జరిగాయి.  మారుతున్న లైఫ్ స్టైల్ కారణంగా.. అవయవాలు పాడవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది గుండె, కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులు వంటి అవయవాల మార్పిడి కోసం ఎదురు చూస్తోన్నారు. కరోనా లంగ్స్ మీద ఎక్కువగా ప్రభావం చూపించడంతో.. లంగ్ ట్రాన్స్ ప్లాంటేషన్స్ చేయించుకుంటున్న వారి సంఖ్య పెరిగింది. అవయవాల మార్పిడి ప్రభుత్వ హాస్పిటల్స్ తో పోల్చితే.. ప్రయివేట్ లో ఎక్కువగా జరుగుతున్నాయి. సిటీలోని ఫేమస్ కార్పొరేట్ హాస్పిటల్స్  అన్నీ జీవన్ ధాన్ లో రిజిస్టర్ చేసుకుని, ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్స్ చేస్తోన్నాయి. అన్ని అవయవాల మార్పిడి.. ఆరోగ్య శ్రీ అండర్ లో ప్రభుత్వం చేర్చడంతో.. పేదలకు కూడా అవయవాల మార్పిడి వరంగా మారింది. ఆర్గాన్ డొనేషన్ పై అవగాహన పెరిగినప్పటకీ.. ఇంకా కొందరు అవయవదానానికి ముందుకు రావడం లేదు. బ్రెయిన్ డెడ్ అవుతున్న పేషంట్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. డొనేషన్స్ కు ముందుకు రావడం లేదు. ఇక జిల్లాల్లో బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలు వృథాగా పోతున్నాయి. జిల్లా స్థాయి హాస్పిటల్స్ లో కూడా బ్రెయిన్ డెడ్ అయితే.. అక్కడ అవయవాలను వేరు చేసే ఏర్పాట్లు చేయాలంటున్నారు రోగులు. 

మరిన్ని వార్తల కోసం

లండన్ నుంచి భారత్కు.. సద్గురు బైక్ యాత్ర
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్ డేట్స్