బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్.. 40 మంది విద్యార్థినిలకు అస్వస్థత

బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్.. 40 మంది విద్యార్థినిలకు అస్వస్థత

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సమీకృత బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. దీంతో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.  వసతిగృహంలో ఫిబ్రవరి 6న  రాత్రి  వండిన మిల్ మేకర్ కూర తిన్న విద్యార్థినిలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  తీవ్ర అనారోగ్యం పాలై వాంతులు  చేసుకొని స్పృహ కోల్పోయారు. ఫుడ్ తిన్న వెంటనే   వార్డెన్ కు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని బాలికలు చెబుతున్నారు.

అస్వస్థతకు గురైన విద్యార్థినిలను తమ సొంత వాహనాలలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. విద్యార్థులకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కొంతమంది విద్యార్థినిల పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు వైద్యులు. పాఠశాలకు చేరుకొని విద్యార్థులకు జరిగిన పరిస్థితి పై వివరాలు ఆరాదీశాయి విద్యార్థి సంఘాలు.