పామును తిన్న జింక.. వైరల్ వీడియోను నమ్మలేకపోతున్న నెటిజన్లు

పామును తిన్న జింక.. వైరల్ వీడియోను నమ్మలేకపోతున్న నెటిజన్లు

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి సుశాంత నంద సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు.  తరచుగా అద్భుతమైన వన్యప్రాణుల వీడియోలతో ఫాలోవర్లను అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ జింక,  పామును తిన్న ఒక మనోహరమైన వీడియోను పంచుకున్నారు. సాధారణంగా జింకలను శాకాహారులుగా పరిగణిస్తారు. ఇవి మొక్కలను ప్రధాన ఆహారంగా తీసుకుంటాయి. కానీ ఈ వీడియోలో అందుకు వ్యతిరేకంగా ఉంది. కారులో వెళ్తున్న ఓ వ్యక్తి ఈ అరుదైన దృశ్యాన్ని చిత్రీకరించినట్టు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో అటవీ ప్రాంతంలో ఉన్న ఒక జింక రోడ్డు పక్కన నిలబడి పామును నమలడం కనిపిస్తోంది. వీడియో రికార్డింగ్ చేస్తున్న వ్యక్తి బ్యాక్‌గ్రౌండ్‌లో "జింక పామును తింటుందా?" అనడం కూడా వినిపిస్తోంది. దీంతో పాటు అవును. శాకాహార జంతువులు కొన్నిసార్లు పాములను తింటాయి అని సుశాంత నంద క్యాప్షన్ ను జోడించారు. ఇక ఈ వైరల్ వీడియోకు నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

ట్విట్టర్ లో షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకు 1లక్ష కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం, జింకలు ఫాస్ఫరస్, ఉప్పు, కాల్షియం వంటి ఖనిజాలను కలిగి ఉండవు. ప్రత్యేకించి శీతాకాలపు నెలలలో మొక్కల జీవం తక్కువగా ఉన్నప్పుడు జింకలు మాంసాన్ని వెంబడించి తినవచ్చు.

https://twitter.com/susantananda3/status/1667936291714142208