
హైదరాబాద్ సిటీ నగరంలో చైనా రెస్టారెంట్ల గురించి అడిగితే సెకను కూడా ఆలోచించకుండా గుర్తొచ్చే పేరు హైకింగ్ రెస్టారెంట్. హిమాయత్‌నగర్లో ఉన్న ఈ ఫెమస్ రెస్టారెంట్ చైనీస్ రుచులు, వంటకాలు సిటీలో ఫెమస్ కాకముందే అంటే 1970ల నుంచే నోరూరించే చైనీస్ వంటకాలను అందిస్తోంది.
1972 నుండి వారసత్వం: హైకింగ్ రెస్టారెంట్ మొదట కేవలం ఒక వ్యాపారంగా స్టార్ట్ కాలేదు, తల్లిదండ్రుల ప్రేమ నుంచి పుట్టింది. 1972లో అఫో, అకుంగ్ అనే దంపతులు హైదరాబాద్‌లో పిల్లల చదువుల ఖర్చులను కోసం ఈ రెస్టారెంట్‌ని ప్రారంభించారు.
"మా తల్లిదండ్రులు మమ్మల్ని మంచి స్కూల్లో చేర్చాలని కోరుకున్నారు. ప్రతి వీకెండ్లో మేము మంచి ఆహారం కోసం ఇంటికి వచ్చే వాళ్ళం. నేడు మేము వడ్డించే ప్రతి వంటకంలోనూ కూడా అదే ప్రేమ ఉంటుంది" అని 1980లో రెస్టారెంట్‌లో చేరిన ప్రస్తుత ఓనర్ చెప్పుకొచ్చారు. ఐదు దశాబ్దాలకు పైగా గడిచినా హైకింగ్ ఇప్పటికీ పటిష్టంగా కొనసాగుతుంది. ఇప్పుడు సిటీలో మూడు బ్రాంచులతో చైనా రుచులను అందిస్తుంది.
హైదరాబాద్లో ఉన్న హైకింగ్ బ్రాంచులు చూస్తే హిమాయత్‌నగర్, రోడ్ నెం. 36 జూబ్లీ హిల్స్, టెక్& కార్పొరేట్ ఉద్యోగుల కోసం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి. ప్రతి బ్రాంచ్ అసలైన వంటకం రుచులను అందిస్తూ కస్టమర్ల మనసు గెలుచుకుంటోంది.
హైకింగ్‌లో తప్పక రుచి చూడాల్సిన వంటకాలు: హైకింగ్ మెనూలో ఇక్కడి ఆహారం ఎప్పుడూ తాజాగా, చైనీస్ పద్ధతులతో పాటు హైదరాబాదీ రుచితో వండుతారు. చికెన్ కార్న్ సూప్, చిల్లీ ప్రాన్స్, బాంబూ చికెన్ రైస్, క్రిస్పీ థ్రెడ్ చికెన్, జింజర్ గార్లిక్ చికెన్, చికెన్ పకోడా, చైనీస్ చాప్ సూయ్, మంచూరియన్ బాల్స్ ఇక్కడ ఫెమస్.
►ALSO READ | సాధారణ చికిత్సతో కూడా 75% కడుపు క్యాన్సర్ కేసులను నివారించొచ్చు
హైకింగ్ హిమాయత్‌నగర్ బ్రాంచుల్లోకి అడుగుపెడితే మీరు కాలంలో వెనక్కి వెళ్ళినట్లు అనిపిస్తుంది. లోపలి చాల సింపుల్గా, కొంచెం పాతబడినట్లు ఉంటుంది. ఇక్కడ అదే ప్రత్యేకత. చాలా కాలంగా వస్తున్న కస్టమర్లు రెస్టారెంట్ వాతావరణం స్కూల్స్ డేస్, ఆదివారం ఫ్యామిలీతో విందు చేస్తున్నట్లు గుర్తుకు తెస్తుందని అంటారు.
హైదరాబాద్‌లో చైనీస్ ఆహార సంస్కృతి: హైదరాబాద్‌లో ముఖ్యంగా యువతలో చైనీస్ వంటకాల పట్ల ఇంట్రెస్ట్ పెరిగింది. స్పైసీ నూడుల్స్ నుండి ఫ్రైడ్ రైస్ వరకు హైదరాబాదీలు ఈ రుచులను ఇష్టపడతారు. హైకింగ్ ఈ ట్రెండ్‌కు అనుగుణంగా స్థానిక రుచులకు తగినట్లుగా చైనీస్ ఆహారాన్ని అందిస్తూ పేరును నిలబెట్టుకుంది. ఇక్కడ రెండు స్టార్టర్స్, సూప్, మెయిన్ కోర్స్, డ్రింక్స్ తో భోజనం కోసం దాదాపు రూ.800 నుండి రూ.1000 వరకు ఖర్చవుతుంది.
హైకింగ్ ఎందుకు స్పెషల్ : 50 సంవత్సరాల పైగా హైదరాబాద్‌లో చరిత్ర, ఐదు దశాబ్దాలకు పైగా నాణ్యత, రుచిని కొనసాగిస్తుంది. అసలైన చైనీస్ వంటకాలకి కేర్ ఆఫ్ అడ్రసుగా కూడా నిలిచింది. తరతరాలుగా కుటుంబ సభ్యులే దీనిని నడుపుతున్నారు. అందరికీ నచ్చే వాతావరణం, నాణ్యమైన ఆహారం ఇంకా తక్కువ ధరలో లభిస్తాయి. హైకింగ్ అంటే కేవలం రెస్టారెంట్ కాదు, అది ఒక హైదరాబాదీ ఫుడ్ లెజెండ్. మీరు హైదరాబాద్‌లో నిజమైన చైనీస్ ఆహారాన్ని కోరుకుంటే ఇతర రెస్టారెంట్లను వదిలేసి నేరుగా హైకింగ్‌కే వెళ్తారు.