
వెస్టిండీస్ మెన్స్ టెస్ట్ జట్టుకు ఆ దేశ క్రికెట్ బోర్డు కొత్త కెప్టెన్ ను ఎంపిక చేసింది. టెస్ట్ కెప్టెన్సీ నుంచి క్రెయిగ్ బ్రాత్‌వైట్ గత నెలలో వైదొలిగాడు. దీంతో అతని స్థానంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆల్ రౌండర్ రోస్టన్ ఛేజ్ ను టెస్ట్ కెప్టెన్ గా శనివారం (మే 17) అధికారికంగా ప్రకటించింది. ఛేజ్ రెండు సంవత్సరాలుగా టెస్ట్ క్రికెట్ ఆడకున్నా ఈ స్పిన్ ఆల్ రౌండర్ కే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ స్థానంలో ఛేజ్ టెస్ట్ పగ్గాలు చేపడతాడు. 2021 లో టెస్ట్ కెప్టెన్సీ చేప్పట్టిన బ్రాత్‌వైట్ తన నాలుగేళ్ల కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు.
రోస్టన్ చేజ్ మార్చి 2023లో దక్షిణాఫ్రికాపై తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. రెండు సంవత్సరాలుగా సుదీర్ఘమైన ఫార్మాట్‌కు దూరంగా ఉన్న అతను తిరిగి జట్టులోకి రావడమే కాకుండా కెప్టెన్సీకి ఎంపికయ్యాడు. 2023 నుండి వెస్టిండీస్ 13 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. అయితే చేజ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌గా పరిగణించలేదు. జూన్, జూలైలలో ఆస్ట్రేలియా వెస్టిండీస్ లో మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ నుంచి ఛేజ్ తన కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరిస్తాడు. జూన్ 25 నుండి బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ తో సిరీస్ ప్రారంభమవుతుంది.
►ALSO READ | RCB vs KKR: బెంగళూరుతో కోల్‌కతా ఢీ.. వర్షం కారణంగా టాస్ ఆలస్యం
2016 నుంచి ఛేజ్ వెస్టిండీస్ టెస్ట్ క్రికెట్ లో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 49 టెస్టుల్లో 26.33 సగటుతో 2265 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్ లో 85 వికెట్లు పడగొట్టాడు. క్రికెట్ వెస్టిండీస్ జస్టిన్ గ్రీవ్స్, జాషువా డా సిల్వా, జాన్ కాంప్‌బెల్, జోమెల్ వారికన్, టెవిన్ ఇమ్లాచ్, రోస్టన్ చేజ్‌లను టెస్ట్ కెప్టెన్సీ అభ్యర్థులుగా షార్ట్‌లిస్ట్ చేసింది. తీవ్రమైన పరిశీలన తర్వాత, అధికారులు రోస్టన్ చేజ్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించాలని నిర్ణయించారు.
JUST IN: Roston Chase has been appointed as West Indies Test captain, taking over the role from Kraigg Brathwaite 🏝️ pic.twitter.com/9YaljzuVQ7
— ESPNcricinfo (@ESPNcricinfo) May 16, 2025