RCB vs KKR: బెంగళూరుతో కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా ఢీ.. వర్షం కారణంగా టాస్ ఆలస్యం

RCB vs KKR: బెంగళూరుతో కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా ఢీ.. వర్షం కారణంగా టాస్ ఆలస్యం

ఐపీఎల్ 2025లో శనివారం (మే 17)రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా నైట్ రైడర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యం కానుంది. వరుణుడు మ్యాచ్ కు అంతరాయం కలిగించడంతో 7 గంటలకు పడాల్సిన టాస్ వాయిదా పడింది.  బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో ప్రస్తుతం భారీ వర్షం కురుస్తుంది. వర్షం తగ్గగానే టాస్ వేస్తారు. మరో రెండు గంటల పాటు వర్షం పడితే ఓవర్లు కుదించి మ్యాచ్ కొనసాగిస్తారు.

బెంగళూరులోని డ్రైనేజ్ వ్యవస్థ అద్భుతంగా ఉండడం వలన మ్యాచ్ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అద్భుతంగా ఆడుతున్న ఆర్సీబీ సొంతగడ్డపై కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించి అందరికంటే ముందుగా ప్లేఆఫ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెర్తు దక్కించుకోవాలని చూస్తోంది. ఇంకోవైపు విరామం ముందు వరకు పడుతూ లేస్తూ వచ్చేన కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఈ పోరు చావోరేవో కానుంది. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓడితే కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా నాకౌట్ రేసు నుంచి వైదొలుగుతుంది. 

►ALSO READ | IPL 2025: లక్నోతో మ్యాచ్‌కు గుజరాత్ స్పెషల్ జెర్సీ.. ఎందుకంటే..?