నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ముఖ్య నేతల పర్యటనలు

నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ముఖ్య నేతల పర్యటనలు
  • 21న మక్తల్, 23న ఆందోల్‌‌కు మహేశ్ గౌడ్, మీనాక్షి నటరాజన్

హైదరాబాద్, వెలుగు:  ‘సర్‌‌’ పై బీఎల్‌‌ఏలకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని, వాటిని స్వయంగా పరిశీలించేందుకు నియోజకవర్గాల్లో పర్యటించాలని రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఈ నెల 21న మక్తల్ నియోజకవర్గంలో, ఈ నెల 23న ఆందోల్ నియోజకవర్గంలో జరిగే బీఎల్‌‌ఏల శిక్షణ కార్యక్రమాల్లో  పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పార్టీ ఇన్‌‌చార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొననున్నారు. ఆ తర్వాత మరిన్ని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కీలక నేతల పర్యటనలతో పార్టీ క్యాడర్ అప్రమత్తం అవడంతో పాటు వారిలో కొత్త జోష్ రానుంది.