మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో తాగి ఇంటి వద్ద గొడవ చేస్తున్న అల్లుడిని మామ ఇనుప రాడ్తో కొట్టి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కంకల కుమారస్వామి, కలమ్మ దంపతులు తమ కూతురు అనూషను అదే గ్రామానికి చెందిన కొండే నరేశ్(36)కు ఇచ్చి పెండ్లి చేశారు.
రోజులుగా మద్యానికి బానిసైన నరేశ్ అత్తగారి ఇంటికి వచ్చి తరచూ గొడవకు దిగుతున్నాడు. సోమవారం అర్ధరాత్రి తాగి గొడవ చేయడంతో మామ, అత్తతో పాటు మృతుడి భార్య దాడి చేశారు. మామ రాడ్తో తలపై కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితులను మంగళవారం రిమాండ్కు తరలించినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.
