సిరీస్పై ఇండియా గురి.. ఇవాళ (జూన్ 17) అఫ్గానిస్తాన్తో రెండో వన్డే.. కుల్దీప్‌‌‌‌, జైస్వాల్కు చాన్స్ ఇస్తారా?

సిరీస్పై ఇండియా గురి.. ఇవాళ (జూన్ 17) అఫ్గానిస్తాన్తో రెండో వన్డే.. కుల్దీప్‌‌‌‌, జైస్వాల్కు చాన్స్ ఇస్తారా?
  • మ. 1.30 నుంచి స్టార్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌లో లైవ్‌‌‌‌

లక్నో: అఫ్గానిస్తాన్‌‌‌‌తో రెండో వన్డేకు టీమిండియా రెడీ అయ్యింది. బుధవారం జరిగే ఈ మ్యాచ్‌‌‌‌లో గెలిచి సిరీస్‌‌‌‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని జట్టులో కొత్త ప్రయోగాలు చేయాలని కూడా యోచిస్తోంది. దాంతో చైనామెన్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌, యశస్వి జైస్వాల్‌‌‌‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత సిరీస్‌‌‌‌ ఫలితం కంటే భవిష్యత్‌‌‌‌ అవసరాలకే జట్టు ఎక్కువగా ప్రాధాన్యమిస్తోంది. 

వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌కు ముందు ఆడబోయే మ్యాచ్‌‌‌‌ల సంఖ్య తక్కువగా ఉండటంతో ప్లేయర్ల సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఈ సిరీస్‌‌‌‌ను ఓ అవకాశంగా భావిస్తున్నారు. ఇప్పటికే మూడో స్థానంలో ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ ఆడుతున్నా.. యశస్విని కూడా పరీక్షించాలని మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆలోచన చేస్తోంది. ఇషాన్, రాహుల్, జైస్వాల్‌‌‌‌లలో ఎవరిని ఏ స్థానంలో ఆడించాలనే అంశంపై ప్రయోగాలు చేస్తున్నట్లు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తెలిపారు.

 సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ తొలి మ్యాచ్‌‌‌‌లో త్వరగానే రనౌట్ అయినప్పటికీ ఈ మ్యాచ్‌‌‌‌లో భారీ స్కోరుపై కన్నేశాడు. వన్డే ఫార్మాట్‌‌‌‌లో మంచి ట్రాక్‌‌‌‌ రికార్డు ఉన్న కుల్దీప్‌‌‌‌ను హర్ష్ దూబే స్థానంలో బరిలోకి దించే అవకాశం ఉంది. పేసర్లుగా గుర్నూర్ బ్రార్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా, ప్రిన్స్ యాదవ్ తన అవకాశం కోసం నిరీక్షిస్తున్నాడు.

  • బ్యాటింగ్‌‌‌‌పై అఫ్గన్‌‌‌‌ దృష్టి

మరోవైపు అఫ్గానిస్తాన్‌‌‌‌ జట్టు బ్యాటింగ్ విభాగంలో సమిష్టిగా రాణించాల్సి ఉంది. తొలి మ్యాచ్‌‌‌‌లో ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా,  మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. అఫ్గన్‌‌‌‌కు ప్రధాన బలం స్పిన్నర్లు. రషీద్ ఖాన్, గజన్‌‌‌‌ఫర్, మహ్మద్ నబీ వంటి ప్రపంచ స్థాయి స్పిన్నర్లు తొలి మ్యాచ్‌‌‌‌లో ఇండియా బ్యాటర్లను పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు. అయితే లక్నో పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో వారు పుంజుకుంటారని ఆ జట్టు ఆశిస్తోంది.

  • తుది జట్లు (అంచనా)

ఇండియా:  రోహిత్ శర్మ, శుభ్‌‌‌‌మన్ గిల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్,  శ్రేయాస్ అయ్యర్, కేఎల్‌‌‌‌ రాహుల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌,  / ప్రసిధ్‌‌‌‌ కృష్ణ, అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌.
అఫ్గానిస్తాన్‌‌‌‌: హష్మతుల్లా షాహిది (కెప్టెన్‌‌‌‌), రహ్మానుల్లా గుర్బాజ్‌‌‌‌, ఇబ్రహీం జద్రాన్‌‌‌‌, సెదికుల్లా అటల్‌‌‌‌, రహమత్‌‌‌‌ షా, అజ్మతుల్లా ఒమర్‌‌‌‌జాయ్‌‌‌‌, మహ్మద్‌‌‌‌ నబీ, రషీద్‌‌‌‌ ఖాన్‌‌‌‌, గజన్‌‌‌‌ఫర్‌‌‌‌, మహ్మద్‌‌‌‌ సలీమ్‌‌‌‌, జియావుర్‌‌‌‌ రెహమాన్‌‌‌‌.