టీజీ 20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్గా విజయ్..

టీజీ 20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్గా విజయ్..

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: టీజీ 20 లీగ్‌‌‌‌ తొలి సీజన్‌‌‌‌ పోటీలు జూన్ 21 నుంచి ఉప్పల్‌‌‌‌ స్టేడియంలో జరగనున్నాయి. ఈ మేరకు టోర్నీ షెడ్యూల్‌‌‌‌ను మంగళవారం విడుదల చేశారు. టాలీవుడ్‌‌‌‌ నటుడు విజయ్‌‌‌‌ దేవరకొండ ఈ లీగ్‌‌‌‌కు బ్రాండ్‌‌‌‌ అంబాసిడర్‌‌‌‌గా వ్యవహరించనున్నాడు. 

‘ప్రతి క్రికెట్ లెజెండ్‌‌‌‌ ఒకప్పుడు కలలతో ప్రయాణం ప్రారంభించిన సాధారణ వ్యక్తి మాత్రమే. తెలంగాణలోని ఏ మూలలోనో ఉన్న యువ క్రికెటర్‌‌‌‌కు తన ప్రతిభను చాటుకునేందుకు ఈ లీగ్ గొప్ప అవకాశం కల్పిస్తోంది. ప్రతిభను గుర్తించి, ఆశయాలకు మద్దతుగా నిలిచే ఈ టోర్నీలో భాగం కావడం గర్వంగా ఉంది’ అని విజయ్‌‌‌‌ పేర్కొన్నాడు.