
మంచి నీళ్ల తర్వాత ఎక్కువగా తాగే డ్రింక్ టీ అట. పొయ్యిమీదకు టీ గిన్నె ఎక్కందే చాలా ఇళ్లలో పనులు ముందుకు సాగవు. తలనొప్పి వచ్చినా, పదిమంది కలిసినా టీ తాగడం కామన్. అయితే ఖాళీ కడుపుతో టీ అస్సలు తాగకూడదు. బ్రేక్‌ఫాస్ట్ చేసిన 20 నిమిషాల తర్వాత టీ తాగితే ఆరోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. అలాగే ఎప్పుడుపడితే అప్పుడు తాగకూడదు. రోజుకు రెండు నుంచి మూడుసార్లు మాత్రమే తాగాలి. టీ మితంగా తాగడం వల్ల కార్డియోవాస్కులర్ జబ్బులు రావట. అంతేకాకుండా టైప్ – 2 డయాబెటిస్, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, కొన్ని రకాల క్యాన్సర్లు దరిచేరవు.
బ్లాక్, గ్రీన్ టీ హార్ట్ ఫ్రెండ్లీ. వాటిలో ఉండే నేచురల్ కంటెంట్ వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు రావు. అంతేకాకుండా టీ తాగడం వల్ల డీ హైడ్రేషన్ అవ్వదట. అయితే తాగొచ్చు కదా అని ఎలాగంటె అలా కాకుండా ఒక లిమిట్‌లో తాగితే టీ ని ఎంజాయ్ చేయొచ్చు.