పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం గురించి, ఇంటర్నెట్‌లో ఆయన హత్యకు గురైనట్లు వస్తున్న పుకార్లు హల్‌చల్ చేస్తుండటంతో ఇమ్రాన్ ఖాన్ ని కలవడానికి ప్రయత్నించిన అతని ముగ్గురు సోదరీలను అడియాలా జైలు మరోసారి అనుమతించకడంతో తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ :
2023 నుండి జైలులో ఉన్న పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ కొన్ని వారాల నుండి బయటికి కనిపించడం లేదు. భద్రతా కారణాలు చెబుతూ జైలు అధికారులు అతని కుటుంబికులు కలవకుండ నిలిపివేశారు. దింతో పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI)లో అలాగే మానవ హక్కుల సంఘాలలో ఆందోళన పుట్టిస్తుంది.
ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరీలైన అలీమా ఖాన్, నోరీన్ నియాజీ, డాక్టర్ ఉజ్మా ఖాన్ అతని పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) మద్దతుదారులతో కలిసి కలవడానికి చాలాసార్లు ప్రయత్నించారు, కానీ జైలు అధికారులు ఒక నెలకు పైగా అనుమతిని నిరాకరిస్తు అడ్డుకున్నారు.
ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 2023 నుండి చాల కేసుల కారణంగా జైలులో ఉన్నారు. ఖైబర్-పఖ్తున్ఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది కూడా కలవడానికి ప్రయత్నించినా అనుమతి ఇవ్వలేదు.
ఈ సంఘటనలు, ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనల మధ్య ఆయన కస్టడీలో మరణించారనే పుకార్లు వచ్చాయి. అయితే, అడియాలా జైలు అధికారులు ఈ పుకార్లను కొట్టిపారేశారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారని, ఆయనకు పూర్తి వైద్య సహాయం అందుతోందని, ఆయనను ఎక్కడికీ తీసుకెళ్లలేదని జైలు ప్రకటించింది.
