హైదరాబాద్ vs బెంగళూర్: ఏ సిటీలో రోడ్లు బెటర్.. వైరల్ అవుతున్న టెకీ వీడియో !

హైదరాబాద్ vs బెంగళూర్: ఏ సిటీలో రోడ్లు బెటర్.. వైరల్ అవుతున్న టెకీ వీడియో !

సౌత్ ఇండియాలో మేజర్ సిటీలైన హైదరాబాద్, బెంగళూరుకు ఎప్పుడూ ఏదో ఒక అంశంలో పోలిక వస్తూనే ఉంటుంది. ఇండియాలోనే టాప్ 5 సిటీల్లో ప్లేస్ సంపాదించిన ఈ మెట్రో నగరాలు అభివృద్ధిలో పోటీ పడుతూ దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో నువ్వా నేనా అన్నట్లుగా ఎదుగుతున్న ఈ రెండు నగరాల  ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఈ సిటీ బెటర్.. కాదు కాదు ఈ సిటీనే బెటర్ అన్నట్లుగా చర్చ జరగుతుంటుంది. అయితే లేటెస్టుగా రోడ్ల విషయంలో ఏ నగరం బెటరో చెప్తూ ఒక యూజర్ పెట్టిన వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. 

హైదరాబాద్ యువకుడు రెండు సిటీల్లో మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ కండిషన్స్ పై పెట్టిన వీడియో లాంగ్ డిబేట్ కు కారణమైంది. అర్బన్ ప్లానింగ్, టెక్నాలజీ హబ్ కు రోడ్ కనెక్టివిటీ అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగుతోంది.

హైదరాబాద్ కు చెందిన ఆశిష్ కుమార్.. 82 కిలోమీటర్ల దూరాన్ని 72 నిమిషాల్లో చేరుకున్న స్క్రీన్ షాట్ షేర్ చేశాడు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) మీదుగా గంట 12 నిమిషాల్లోనే 82 కిలోమీటర్లను చేరుకున్నట్లు పోస్టు చేశాడు. కర్ణాటక క్యాపిటల్ బెంగళూరులో ఇది సాధించాలంటే ఇంకో పదేండ్లు పడుతుందంటూ ట్వీట్ చేశాడు. 

ఈ పోస్టులు ఆన్ లైన్ లో వెంటనే వైరల్ గా మారింది. 100 లైక్స్ తో 3.5 లక్షల వ్యూస్ దాటి ట్రెండవుతోంది. హైదరాబాద్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఏటేటా అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది.. అదే బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు, రోడ్ల కనెక్టివిటీ దారుణంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. 

హైదరాబాద్ లో నిమిషాల్లో పూర్తయ్యే ప్రయాణం.. బెంగళూరులో గంటలు పడుతుందని చెప్పాడు. బెంగళూరు రోడ్లు గుంతలతో.. ఒక్కోసారి ప్రాణాల మీదికి వస్తున్నట్లు పేర్కొన్నారు. 

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో నుండి పెద్ద ఎత్తున డిబేట్ కు దారి తీసింది. చాలా మంది యూజర్లు కుమార్ తో ఏకీభవించారు. మరికొందరు బెంగళూరు ఎదుర్కొంటున్న కీలక సవాళ్లకు కారణం వేగంగా  జనాభా పెరుగటం, వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండటాన్ని హైలైట్ చేశారు.

అయితే, చాలా మంది బెంగళూరు వాసులు  దీన్ని వ్యతిరేకిస్తూ రిప్లై ఇచ్చారు. మా సిటీలో కూడా తొందరగానే గమ్యాన్ని చేరుకుంటామని గూగుల్ మ్యాప్స్ స్క్రీన్‌షాట్‌లను పోస్ట్ చేశారు. కొందరు మాత్రం హై-స్పీడ్ రింగ్ రోడ్‌ను బెంగళూరు సిటీ రోడ్లతో పోల్చడం అన్యాయమని అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్‌తో సహా ఇండియాలోని చాలా సిటీల్లో ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌వేలు మినహా, మెయిన్ సిటీలోని రోడ్లలో గంటకు దాదాపు 68 కిలోమీటర్ల వేగాన్ని మించి వెళ్లడం సాధ్యం కాదని మరో యూజర్ పేర్కొన్నారు. బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ సమస్యపై విమర్శలు కొనసాగుతున్న తరుణంలోనే ఈ చర్చ లైవ్ లోకి రావటం వైరల్ అవుతోంది.