V6 News

Winter Special: చలికాలంలో రక్షణ కవచంలా ఉపయోగపడే ఉన్ని దుస్తులను ఇలా అస్సలు ఉతకొద్దు..!

Winter Special: చలికాలంలో రక్షణ కవచంలా ఉపయోగపడే ఉన్ని దుస్తులను ఇలా అస్సలు ఉతకొద్దు..!

చలికాలంలో ఉన్ని దుస్తులు ఎంతో ఉపయోగపడతాయి. మఫ్లర్, స్వెటర్, గ్లాజులు, సాక్సులు ఇలా ఎన్నో ఉలెన్ వేర్ను ఈ కాలంలో ప్రతి రోజు ఉపయోగిస్తుంటారు. మరి వాటిని ఉతికేటప్పుడు మామూలు దుస్తుల్లా కాకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

సరైన బ్రష్: ఉన్ని దుస్తులను ఎట్టి పరిస్థితుల్లో వాషింగ్ మెషీన్లో వేయకూడదు. ఆ దుస్తులకు తగ్గట్టుగా బ్రష్ ఎంచుకోవాలి. దీంతో దానిపై ఉండే దుమ్ము, దూళి, వెంట్రుకలు, దారాలు పోతాయి. అంతేకాదు ప్రతిరోజు స్వెటర్ ఉపయోగిస్తాం. కాబట్టి ఎక్కువ మురికి వాటిపై పేరుకుపోతుంది. అందుకే రెండు రోజులకోసారి వాటిని ఉతకడం మంచిది.
 

డ్రై క్లీనింగ్: ఏదో ఒక సందర్భంలో ఉన్ని దుస్తులపై మరకలు పడుతూనే ఉంటాయి. వెంటనే వాటికి డ్రై క్లీనింగ్ చేయించాలి. మరీ అంత పెద్ద మరక కాకపోతే చేతులతో ఉతకాలి. అదీ కూడా నాణ్యమైన సబ్బు ఉపయోగించాలి. పండ్ల మరకలను తొలగించడానికి మరకపై ముందుగా గ్లిజరిన్ వేసి ఉతికితే సరిపోతుంది. జిగురు మరకలు అంటుకుంటే.. ఆ భాగంపై కొన్ని ఆల్కహాల్ చుక్కలు వేస్తే సరిపోతుంది. టీ పడితే వెంటనే చక్కెర వేయాలి. దీంతో మరక గాఢత
వెచ్చని నీటితో కడిగితే మరక పోతుంది. 

తీగలపై ఆరేయకూడదు: మిగతా దుస్తులు వేసినట్టు.. ఉలెన్ ను తీగలపై ఆరే యకూడదు. అలా చేస్తే సాగిపోయి ఆకారం మారే అవకాశం ఉంది. వీలైనంత వరకు వాటిని గోడల పైనో లేదంటే టేబుల్ పైనో ఆరేయడం మేలు. వాటికి వేడి కూడా ఎక్కువ తగలకుండా జాగ్రత్త పడాలి.

స్టోరేజ్ ఇలా..

  • శీతాకాలంలో రంగురంగుల జాకెట్లు, స్వెట ర్లు, స్కార్ఫ్, సాక్సులు వేసుకుంటాం. అయితే, సీజన్ పూర్తవగానే వాటిని భద్రపరచడంపై శ్రద్ధ పెట్టం. దీంతో దుస్తులు త్వరగా పాడైపోతాయి. ఉన్ని దుస్తులు కాపాడుకోవాలంటే ఈ పద్ధతు లు పాటించాల్సిందే..
  • ఉన్ని దుస్తులు దాచే ముందు మైల్డ్ డిట ర్టెంట్తో బాగా ఉతికి తేమలేకుండా ఆర బెట్టాలి. భద్రపరిచేటప్పుడు దుస్తుల్లో తేమ ఉంటే ఫంగస్ చేరుతుంది. కుంకుడు కాయ నీళ్లల్లో ఉన్ని దుస్తులు ఉతికితే వాటి మెరుపు నిలిచి ఉంటుంది.
  • వులెన్ వేర్ ను దాచి పెట్టడానికి పాత దిండు కవర్లు వాడొచ్చు. అయితే, వాటిని సీల్ చేయడం(జిప్ లాక్) మరచిపోకూడదు. వీలుంటే ఉన్ని దుస్తులను కేన్ డబ్బాలో పెట్టొచ్చు.
  • ఫరో కోట్, లెదర్ జాకెట్ వంటివి సున్నితం గా ఉంటాయి. కాబట్టి వాటిని మెత్తటి వస్త్రం లో చుట్టి భద్రపరుచుకోవాలి. చీమలు, కీటకాలు చేరకుండా ఉండేందుకు నాఫ్తలీ న్ బాల్స్ తప్పకుండా ఉంచాలి.
  • స్వెటర్కు రంధ్రం పడినా లేదా బటన్ ఊడి పోయినా.. దాచే ముందు వాటిని సరిచేసు కోవాలి. ఉన్ని దుస్తులను ప్లాస్టిక్ బ్యాగులో పెట్టకూడదు. ఇలా చేస్తే దుస్తుల్లోకి తేమ చేరి పాడవుతాయి. మార్కెట్లో దొరికే మెడికల్ స్పేలు చల్లితే ఫంగస్ చేరదు.
  • ఉన్ని దుస్తులను పురుగులు, తేమ నుంచి రక్షించేందుకు పటిక పొడి చల్లాలి. ఎండిన వేపాకులు, పొగాకు పేపర్ మడతలో పెట్టి ఉంచితే క్రిమి, కీటకాలు దరిచేరవు.
  • ఉన్ని దుస్తులపై దారాలు బయటకు వస్తే రేజర్తో స్మూత్గా షేవ్ చేయాలి. దీంతో వదులుగా ఉన్న పోగులు తెగిపోతాయి. వీటిని హ్యాంగరు వేలాడదీ కూడదు. ఇలా చేస్తే సాగిపోతాయి. చక్కగా మడతలు వేసి పెట్టడం మంచిది.
  • స్వెటర్ దాచేటప్పుడు కలర్స్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తేలిక రంగుతోముదురు రంగుల దుస్తులు కలిపి ఉంచకూ డదు. తెలుపుతో క్రీమ్, స్కైబ్లూతో పర్పుల్.. పింక్తో రెడ్, మెరూన్, గ్రీన్తో ఎల్లో కలర్ కలిపి ఉంచాలి.
  • స్టోర్లో ఉంచే దుస్తులను ఎప్పుడూ వెలుతురు పడే స్థలానికి దూరంగా ఉంచాలి. ఎక్కువ వెలుతురులో ఉంచితే దాని ప్రభావం రంగుపై పడుతుంది.
  • స్వెటర్, జాకెట్ తో టోపీ, సాక్సులు, మఫ్టర్. కలిపి ఉంచకూడదు. దుస్తులతో పాటు ఖాళీ పెర్ఫ్యూమ్ బాటిల్ ఉంచితే మంచి వాసన వస్తాయి. గంధం పొడి కూడా దుస్తుల మధ్య ఉంచొచ్చు.
  • ఉన్ని దుస్తుల్ని బయటకు తీసిన ఇరవై నాలుగు గంటల తర్వాతే ధరించాలి. అదే విధంగా ఉన్ని దుస్తులు ధరించేటప్పుడు. కాసేపు ఎండలో ఉంచితే మంచిది.