మున్సిపల్ కమీషనర్ కు వడ్డించిన బిర్యానీలో పురుగులు

మున్సిపల్ కమీషనర్ కు వడ్డించిన బిర్యానీలో పురుగులు
  • హోటల్ సీజ్.. రూ.50వేలు జరిమానా 

నిర్మల్  జిల్లా: భోజనం చేసేందుకు హోటల్ కు  వెళ్లిన మున్సిపల్ కమిషనర్ కు చేదు అనుభవం ఎదురైంది. స్వయంగా తనకు వడ్డించిన ప్లేటులోని బిర్యానీలో పురుగులు కనిపించడంతో ఆయన షాక్ తిన్నారు. తన సిబ్బందికి వడ్డించిన బిర్యానీలో కూడా పురుగులు కనిపించడంతో ఆయన వెంటనే స్పందించి ఫుడ్ ఇన్స్ పెక్టర్ ను పిలిపించి తనిఖీ చేయించగా దిమ్మదిరిగిపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చింది. కుళ్లిపోయిన మాంసాన్ని వండి.. వడ్డిస్తున్నట్లు తేలింది. ఫ్రిజ్ లో నిల్వ చేసిన చికెన్.. మటన్ ను పరిశీలించగా.. కుళ్లిపోయి.. బూజు పడుతున్నట్లు గుర్తించారు. 
లక్ష్మి గ్రాండ్ హోటల్ సీజ్.. 
మున్సిపల్ కమిషనర్.. ఆయన సిబ్బందికి కుళ్లిపోయిన మాంసంతో బిర్యానీ వడ్డించినట్లు తేలడంతో జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గ్రాండ్ హోటల్ ని సీజ్ చేశారు. అలాగే రూ.50 వేలు జరిమానా విధించారు మునిసిపల్ కమీషనర్. కిచెన్ కూడా చాలా అపరిశుభ్రంగా ఉండడంతో ఇక్కడ భోజనం చేసిన వారంతా అనారోగ్యం పాలై ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో వంటలు వండుతూ ప్రజలకు వడ్డిస్తున్నట్లు నిర్ధారించుకుని హోటల్ కు 50 వేలు జరిమానా విధించారు.