మనం ప్రతిరోజు చేసే పనులు లేదా మని ట్రాన్సక్షన్స్ కి పాన్ కార్డు ఎంత ముఖ్యమో తెలిసే ఉంటుంది. పన్ను కట్టాలన్నా, బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా, పెద్ద మొత్తంలో ట్రాన్సక్షన్స్ చేయాలన్నా పాన్ ఈ రోజుల్లో తప్పనిసరి... ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్ తెరవడానికి వెళ్లినా లేదా పన్ను కట్టడానికి, డబ్బు ట్రాన్స్ఫర్ చేయడానికి వెళ్లిన... మీ పాన్ కార్డు ఆధార్‌తో లింక్ కాలేదని, మీ పాన్ కార్డు పనిచేయడం లేదని (డీయాక్టివేట్ అయ్యింది) అని చెబితే ఎలా ఉంటుంది ? ఇప్పటికి మీరు ఇంకా ఆధార్ పాన్‌తో లింక్ చేయకపోతే జరిగేది ఇదే....
 పాన్ ఆధార్ ఎందుకు లింక్ చేయాలి:
మీరు ఆధార్‌తో పాన్ లింక్ చేయడానికి 31 డిసెంబర్  2025 లాస్ట్ డేట్ దాటితే 1 జనవరి  2026 నుండి మీ పాన్ కార్డు పనిచేయదు అంటే డీయాక్టివేట్ అవుతుంది. కాబట్టి, ఏదైనా పెద్ద పనుల్లో సమస్యలు కలగకుండా ఉండాలంటే వెంటనే మీ పాన్ కార్డు ఆధార్‌తో లింక్ చేసుకోండి.
 ఆధార్‌ని పాన్‌తో ఎలా లింక్ చేయాలంటే :
*ఆదాయపు పన్ను వెబ్సైట్ https://www.incometax.gov.in/iec/foportal/ ఓపెన్ చేయండి
*హోమ్‌పేజీలో కింద ఎడమవైపు ఉన్న “లింక్ ఆధార్” ఆప్షన్ క్లిక్ చేయండి.
*ఇప్పుడు మీ 10 అంకెల పాన్ ఇంకా  12 అంకెల ఆధార్ నంబర్  ఎంటర్ చేయండి.
*తరువాత సూచనలను పాటిస్తూ రూ.1000 చెల్లించాలి. 
*ఇప్పుడు సబ్మిట్ క్లిక్ చేస్తే  ఆధార్ పాన్ లింక్ ప్రాసెస్ అవుతుంది. 
లింక్ అయ్యిందో లేదో ఎలా తెలుసుకోవాలి అంటే  ?
1. ఆన్లైన్లో : అదే పోర్టల్‌లో “లింక్ ఆధార్ స్టేటస్” ఆప్షన్ క్లిక్ చేసి  మీ పాన్, ఆధార్ నంబర్లను ఎంటర్  చేయండి. అవి రెండూ లింక్ అయ్యాయో లేదో స్క్రీన్‌పై కనిపిస్తుంది.
2. SMS ద్వారా : UIDPAN <12-అంకెల ఆధార్ నంబర్> <10-అంకెల పాన్ నంబర్>...  ఈ మెసేజ్‌ను 567678 లేదా 56161కు పంపండి.
 
గుర్తుంచుకోండి ఆన్లైన్ ప్రక్రియలో వచ్చే OTP కోసం ఉపయోగించే మొబైల్ నంబర్ కచ్చితంగా మీ ఆధార్‌తో లింక్ చేసి ఉండాలి.
