షర్మిళ పార్టీ పేరు: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ

 షర్మిళ పార్టీ పేరు: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ
  • అన్నబాటలోనే అడుగులు వేస్తున్న షర్మిళ

హైదరాబాద్: వైఎస్ షర్మిళ పార్టీ పేరు ఖరారైంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ గా ఖరారైనట్లు సమాచారం. పార్టీ జెండా.. అజెండా.. విధివిధానాలను అధికారికంగా వైఎస్ జయంతి రోజున జులై 9న ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనం రేకెత్తించే రీతిలో పార్టీ ప్రకటన చేసిన వైఎస్ షర్మిళ లోటస్ పాండ్ నుండి తన తల్లి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మతో కలసి పార్టీ కార్యకలాపాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాలో బహిరంగ సభ ద్వారా తన రాజకీయ ప్రవేశాన్ని స్పష్టం అని తేల్చి చెప్పారు. 
జులై 8న పార్టీ ప్రారంభం
జులై 8న పార్టీ ప్రారంభిస్తున్నట్లు వైఎస్ షర్మిళ వర్గాల సమాచారం. జూన్ 8 నుంచి పార్టీ ఆవిర్భావ సన్నాహ కార్యక్రమాలు చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జులై 21 నుంచి పాదయాత్ర చేపట్టాలని వ్యూహరచన చేస్తున్నారు. తెలంగాణలో షర్మిల చిన్న నాటి స్నేహితురాలు రజిని సొంత అన్నయ్య వాడుక రాజగోపాల్ షర్మిల పాదయాత్ర సమయంలో ప్రతి నిమిషం వెన్నంటి నిలిచారు. వాడుక రాజగోపాల్ వైఎస్ రాజశేఖర రెడ్డికి వీరాభిమాని కూడా. షర్మిలకు ఇప్పుడున్న అనుచరులలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి రాజగోపాల్. ఇతను పార్టీ ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసినట్లు సమాచారం. రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యంగా తర్వాత జులై 9న వైఎస్ జయంతి రోజున కీలకమైన ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.