
అడవులు ఆదివాసీల హక్కన్నారు YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.వారిని అడవుల నుండి వెళ్ళగొట్టే అధికారం ఎవరికీ లేదన్నారు.ములుగు జిల్లా లింగాల గ్రామంలో పోడు భరోసా యాత్ర లో పాల్గొన్న వైఎస్ షర్మిల..కేసీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు YSR ఆదివాసీల పోడు భూములకు పట్టాలు ఇస్తే.. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కొత్త పట్టాలు ఇవ్వకపోగా ఉన్న పట్టాలను లాక్కుని ఆదివాసీలను ఆగం చేస్తున్నారన్నారు. కేసీఆర్ అవసరానికి కాళ్లు పడతాడు.. అవసరం తీరితే జుట్టు పడతాడని విమర్శించారు షర్మిల.అటువంటి సీఎం తెలంగాణకు అవసరమా అని ప్రశ్నించారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే నాన్నలాగే అందరికీ హక్కు పత్రాలు ఇస్తామని స్పష్టం చేశారు.