ఉచిత న్యాయ సాయాన్ని పొందండి

ఉచిత న్యాయ సాయాన్ని పొందండి

జహీరాబాద్, వెలుగు : పేద, బడుగు, బలహీన వర్గాలకు, లాయర్ ను ఏర్పాటు చేసుకోలేని స్థితిలో ఉన్న వారికి ఉచితంగా న్యాయ సాయం అందించనున్నట్లు జహీరాబాద్ సీనియర్ సివిల్ జడ్జి దుర్గాప్రసాద్ తెలిపారు. శుక్రవారం ప్యాన్ ఇండియా లీగల్ అవేర్ నెస్ లో భాగంగా మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో కోహిర్ ​గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఉచిత న్యాయ సాయాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. వివాదాలు పరిష్కరించుకునే విధానం, అగ్రిమెంట్లు, లావాదేవీలు జరిపే సమయంలో జరిగే అవకతవకలను సరిదిద్దే విధానంపై సూచనలు, సలహాలు ఇచ్చారు. తహసీల్దార్ ఆఫీస్ లో ఉచిత న్యాయ సేవ కేంద్రాన్ని ప్రారంభించారు. అంతకుముందు బిలాల్​పూర్, పైడిగుమ్మల్ గ్రామాల్లో క్యాంప్ నిర్వహించి చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏజీపీ సయ్యద్ అహ్మద్, ఏపీపీ సలోమాన్, తహసీల్దార్ కిషన్, డీఎస్పీ శంకర్ రాజు, పారాలీగల్ వలంటీర్లు పాల్గొన్నారు.