టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సొమ్ము స్వాహా వ్యవహారంలో ఎంక్వైరీ పూర్తయినా రికవరీ నిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సొమ్ము స్వాహా వ్యవహారంలో ఎంక్వైరీ పూర్తయినా రికవరీ నిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
  • కొండగట్టు ఆలయంలో మూడేళ్ల కింద టెండర్ సొమ్ము రూ.52 లక్షలు గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాల్
  • ఈ వ్యవహారంలో ప్రమేయమున్న ఈవో, సీనియర్​అసిస్టెంట్ గతంలోనే సస్పెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • విచారణ పూర్తయినా సొమ్ము రికవరీకి చర్యల్లేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

జగిత్యాల, వెలుగు: కొండగట్టు అంజన్న ఆలయంలో మూడేళ్ల కింద టెండర్ సొమ్ము రూ.52లక్షలు గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విచారణ పూర్తయింది. అయితే ఎంక్వైరీ పూర్తయినా ఇప్పటికీ సొమ్ము రికవరీకి చర్యలు తీసుకోలేదు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఈవో, సీనియర్ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గతంలోనే సస్పెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయగా.. ఇప్పటికీ సొమ్ము రికవరీని అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో మరికొందరు అధికారుల ప్రమేయం ఉండడం వల్లే చర్యలు తీసుకోవడంలో ఆలస్యమవుతుందన్న ఆరోపణలున్నాయి. 

మూడేండ్ల కింద బయటకు..

మూడేళ్ల కిందట వెలుగులోకి వచ్చిన రూ.52 లక్షల టెండర్ సొమ్ము గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాల్ విచారణ చివరి దశకు చేరింది. సాధారణంగా ప్రతి ఏడాది మార్చిలో 13 షాపుల టెండర్లు పిలిచే ఆలయ ఎండోమెంట్ అధికారులు, 2024– 25కు సంబంధించి టెండర్ రెండు నెలల ముందుగానే లీజులు ఇవ్వడం అనుమానాలకు తావిచ్చింది. టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దారులు నో డ్యూ సర్టిఫికేట్ కోసం సమర్పించిన రసీదులు క్యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లేకపోవడం, ఉన్నతాధికారుల సంతకాలు కనిపించకపోవడంతో టెండర్​ సొమ్ము ఆలయ ఖాతాలో జమ కాలేదని నిర్ధారించారు. కొబ్బరికాయల షాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కిరాణా, పూలు-పండ్ల షాపులు, సులభ్ కాంప్లెక్స్ తదితర లీజుల ద్వారా మొత్తం రూ.37.90 లక్షలు మాయం కావడంతో సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ చారి, అనంతరం ఈవో వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సస్పెండ్ చేశారు. 

విచారణలో మరో రూ.30లక్షల దాకా అవినీతి బయటకు..

టెండర్ సొమ్ము స్వాహాపై అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో 2025 మార్చి 19న నాటి అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ జ్యోతి మరో రూ.14 లక్షలు కూడా పక్కదారి పట్టినట్లు గుర్తించారు. దీంతో మొత్తం అవినీతి వ్యవహారం రూ.52 లక్షలు చేరింది. అధికారులు 2018 నుంచి జరిగిన అన్ని లావాదేవీలను స్వాధీనం చేసుకుని దాదాపు ఆరేళ్ల రికార్డును పరిశీలించారు.

2024లో సెప్టెంబర్ 3న టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దారులు, ఆలయ సిబ్బందిని విచారించి వారు సమర్పించిన బిల్లులను సూక్ష్మంగా పరిశీలించారు. ఈ ప్రక్రియలో మరో రూ.30 లక్షల దాకా గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో మొత్తం అవినీతి కోటి దాకా చేరే అవకాశాలు ఉన్నాయని ఆలయ వర్గాలు సూచిస్తున్నాయి.