10లక్షల విలువైన గంజాయి పట్టివేత

10లక్షల విలువైన గంజాయి పట్టివేత

మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో భారీగా గంజాయి పట్టుబడింది. ఈ ఘటనలో శివరాత్రి నరేంద్ర అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని 10 లక్షల విలువైన 40 కిలోల గంజాయి, కారు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. శివరాత్రి నరేంద్ర వైజాగ్ కు చెందిన రాజేష్ అనే వ్యక్తి నుంచి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్ లో విక్రయించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని గంజాయిని సీజ్ చేశామని డీసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. గంజాయిని విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.