ఆల్‌‌‌‌ ఫలాహ్‌‌‌‌ యూనివర్సిటీ నుంచి 10 మంది మిస్సింగ్‌‌‌‌?

ఆల్‌‌‌‌ ఫలాహ్‌‌‌‌ యూనివర్సిటీ నుంచి 10 మంది మిస్సింగ్‌‌‌‌?
  •     ఎర్రకోట బ్లాస్ట్‌‌‌‌ జరిగిన తర్వాత వారు అదృశ్యమయ్యారని నిఘా వర్గాల వెల్లడి

ఫరిదాబాద్‌‌‌‌: హర్యానాలోని ఫరిదాబాద్‌‌‌‌లో ఉన్న ఆల్‌‌‌‌ ఫలాహ్‌‌‌‌ యూనివర్సిటీ నుంచి 10 మంది మిస్‌‌‌‌ అయినట్లు ఇంటెలిజెన్స్‌‌‌‌ వర్గాలు వెల్లడించాయి. వీరిలో ముగ్గురు కాశ్మీర్‌‌‌‌‌‌‌‌కు చెందిన వారు ఉన్నారని తెలిపాయి. వీరిలో కొంత మంది స్టూడెంట్స్, మరికొంత మంది సిబ్బంది ఉన్నారని చెప్పాయి. వారిని కాంటాక్ట్‌‌‌‌ అవ్వడానికి ప్రయత్నించగా,వారి ఫోన్లు స్విచ్ఛాఫ్‌‌‌‌ అయినట్లు గుర్తించామని ఇంటెలిజెన్స్‌‌‌‌ వర్గాలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపాయి. 

జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌, హర్యానా పోలీసుల సంయుక్త ఆపరేషన్‌‌‌‌ తర్వాత ఈ 10 మంది అదృశ్యం అయిన విషయం వెలుగులోకి వచ్చింది. వీరంతా టెర్రర్‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌ మాడ్యూల్‌‌‌‌లో భాగమై ఉండొచ్చని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ విషయాన్ని అప్పుడే ధృవీకరించలేమంది.