ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్​

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్​

 షాద్ నగర్,వెలుగు: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక హోరాహోరీగా జరిగింది. గురువారం నిర్వహించిన ఎన్నికలో భాగంగా క్రాస్ ఓటింగ్ జరగకుండా పోలింగ్ కేంద్రం వద్ద  ఇరు పార్టీల నేతలు తిష్ట వేశారు. షాద్ నగర్ సెగ్మెంట్ పరిధిలోని ఫరూఖ్ నగర్, కేశంపేట, కొందుర్గు, నందిగామ, కొత్తూరు, చౌదరిగూడెం మండలాలతో పాటు కల్వకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్ లోని తలకొండపల్లి, ఆమనగల్, మాడ్గుల, కడ్తాల్ మండలాల స్థానిక సంస్థల ఓటర్లకు ఫరూఖ్ నగర్ ఎంపీడీఓ ఆఫీసులో పోలీంగ్ బూత్ ఏర్పాటు చేశారు. 

కాంగ్రెస్,  బీఆర్ఎస్ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లను కాపాడుకునేందుకు వారం రోజులు  క్యాంపులు నిర్వహించి.. అటు నుంచి నేరుగా బస్సుల్లో  పోలింగ్ కేంద్రానికి తరలించారు. షాద్ నగర్ సెగ్మెంట్ లో మొత్తం 171 ఓట్లు ఉండగా 100 శాతం ఓట్లు పోలయ్యాయని రిటర్నింగ్ అధికారి పార్థసారథి తెలిపారు.  మహిళల ఓట్లు 94  ఉండగా.. 77 పడ్డాయి. అయితే.. గెలుపుపై  అభ్యర్థులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కూడా ఓటువేశారు.