ఈ ఇండియా అమ్మాయిని పట్టిస్తే 10 వేల డాలర్లు బహుమతి

ఈ ఇండియా అమ్మాయిని పట్టిస్తే 10 వేల డాలర్లు బహుమతి

నాలుగు సంవత్సరాల క్రితం న్యూజెర్సీ నుండి తప్పిపోయిన భారత్ కు చెందిన మయూషి భగత్  అనే  29 ఏళ్ల మహిళా విద్యార్థిని ఆచూకీ కోసం గురించి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వెతుకుతుంది.  పలు బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మరీ గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో ఎఫ్‌బీఐ కీలక ప్రకటన చేసింది. ఆమె ఆచూకీ చెప్పిన వారికి ఏకంగా 10,000 డాలర్ల  అంటే ఇండియన్ కరెన్సీలో సుమారుగా రూ.8.32 లక్షల కోట్ల రివార్డును అందిస్తామని ప్రకటించింది.  

మయూషి భగత్ చివరిసారిగా జెర్సీ సిటీలోని తన అపార్ట్‌మెంట్ నుండి 2019 ఏప్రిల్ 29న బయటకు వెళ్లింది. 2019 మే1 న ఆమె అదృశ్యమైనట్లు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎంతకీ ఆమె ఆచూకీ తెలియకపోవడంతో గతేడాది మిస్సింగ్ వ్యక్తుల జాబితాలో మయూషి పేరుని ఎఫ్‌బీఐ చేర్చింది. 

 మయూషి భగత్ స్టూడెంట్ వీసాపై అమెరికా వెళ్లింది. అక్కడ న్యూయార్క్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతుంది.  ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలు అనర్గళంగా మాట్లాడుతుంది.  ఆమె జుట్టు నల్లగా ఉంటుందని, కళ్లు గోధుమ రంగులో ఉంటాయని, ఎత్తు 5'10 అడుగులు ఉంటుందని  ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్  తెలిపింది. 

తమ వెబ్ సైట్ లో  మోస్ట్ వాంటెడ్ వ్యక్తుల జాబితాలో మయూషి పేరుని 'మిస్సింగ్ లేదా కిడ్నాప్ అయిన వ్యక్తిగా పేర్కొంది.  మయూషీ ఆచూకీ ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే.. ఎఫ్‌బీఐ  నెవార్క్ లేదా జెర్సీ సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు కాల్ చేయాలని నిఘా సంస్థ తెలిపింది.