‘మన్ కీ బాత్’ సెంచరీ.. వెయ్యికి పైగా రేడియో స్టేషన్‌‌‌‌‌‌‌‌లలో ప్రసారం

‘మన్ కీ బాత్’ సెంచరీ.. వెయ్యికి పైగా రేడియో స్టేషన్‌‌‌‌‌‌‌‌లలో ప్రసారం

న్యూఢిల్లీ: మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ఆదివారం రేడియోలో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీకి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కంగ్రాట్స్ చెప్పారు. ''దేశంలో పారిశుధ్యం, ఆరోగ్యం, మహిళల ఆర్థిక సాధికారత, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించిన అనేక అంశాలపై పనిచేయడానికి ప్రధాని మోడీ చేపట్టిన మన్ కీ బాత్ కార్యక్రమం వివిధ వర్గాలను ప్రేరేపించింది.

100వ మన్ కీ బాత్ ఎపిసోడ్​కు, ప్రధాని నరేంద్ర మోడీ కి అభినందనలు" అని బిల్ గేట్స్ ట్వీట్ చేశారు. మరోవైపు 100వ ఎపిసోడ్‌‌‌‌‌‌‌‌ ఎక్కువ మందికి  చేరువ చేసేలా బీజేపీ ప్రత్యేక సన్నాహాల్లో నిమగ్నమై ఉంది. ఇప్పటికే ఈ కార్యక్రమం ప్రైవేట్ ఎఫ్ఎం స్టేషన్‌‌‌‌‌‌‌‌లు, కమ్యూనిటీ రేడియోలు, వివిధ టీవీ ఛానెల్‌‌‌‌‌‌‌‌లతో సహా  వెయ్యికి పైగా రేడియో స్టేషన్‌‌‌‌‌‌‌‌లలో ప్రసారం అయ్యేలా ఏర్పాట్లు చేశారు. మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ సందర్భంగా స్టాంపు, నాణెం కూడా విడుదల చేశారు. కాగా, 'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.