భద్రాచలం పట్టణంలో 101 కిలోల గంజాయి పట్టివేత

భద్రాచలం పట్టణంలో 101 కిలోల గంజాయి పట్టివేత

భద్రాచలం, వెలుగు: భద్రాచలం పట్టణంలో ఆబ్కారీ పోలీసులు శనివారం 101 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కూనవరం రోడ్డులోని వీరభద్ర ఫంక్షన్ హాల్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, కారును ఆపి తనిఖీ చేశారు. అందులో ఆరు బ్యాగుల్లో ఉన్న 101 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

కర్ణాటకకు చెందిన సత్తిపాపా, హర్భజ్ హుస్సేన్, గుల్జార్, ఏపీకి చెందిన రాజేంద్రప్రసాద్ అనే నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు సెల్‌‌‌‌ఫోన్లు, ఎర్టిగా కారును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి మొత్తం విలువ రూ.56 లక్షలు ఉంటుందని ఆఫీసర్లు తెలిపారు.