
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పవర్ ట్రాన్స్‌కో (టీజీట్రాన్స్‌కో)లో మాన్‌పవర్ రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా 107 కొత్త పోస్టులను మంజూరు చేస్తూ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి. కృష్ణభాస్కర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ క్రమంలో మెట్రో సౌత్ (మామిడిపల్లి), సిద్దిపేట, వనపర్తి, సూర్యాపేట, జనగామా, రామగుండం పేర్లతో ఆరు కొత్త ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓ&ఎం) సర్కిల్స్ ఏర్పాటు అవుతున్నాయి. వీటికి 7 సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ) పోస్టులు కేటాయించారు.
అదనంగా, 97 అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ) పోస్టులు ట్రేడింగ్, ఎస్‌సీఏడీఏ, మార్కెట్ ఆపరేషన్స్, మెట్రో, రూరల్, వరంగల్, కరీంనగర్ జోన్లకు కేటాయించారు. ఈ నిర్ణయం కమిటీ రిపోర్ట్ ఆధారంగా తీసుకున్నదని, మిగిలిన పోస్టుల కేటాయింపును దశలవారీగా చేపట్టనున్నట్లు ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు.ఫైనాన్స్ విభాగంలో కూడా ముఖ్య మార్పులు తీసుకొచ్చారు.
ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ కాంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ (ఎఫ్ఏ & సీసీఏ- ఆడిట్, ఎక్స్‌పెండిచర్), ఒక డిప్యూటీ చీఫ్ కాంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ (డీసీసీఏ- రిసోర్సెస్, అకౌంట్స్), ఒక డైరెక్టర్ (సర్వీసెస్)/హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్-2 పోస్టులు సృష్టించారు. ఇప్పటికే ఉన్న చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) పోస్టును కూడా రీస్ట్రక్చర్ చేశారు. ఈ మార్పులు ఆర్థిక నిర్వహణ, ఆడిట్, హ్యూమన్ రిసోర్సెస్ విభాగాల్లో సాంకేతికతను పెంచుతాయని అధికారులు పేర్కొన్నారు.