దారి తప్పుతున్న 108 అంబులెన్స్ లు.. ఏపీకి తరలిస్తున్నరు !

దారి తప్పుతున్న 108 అంబులెన్స్ లు.. ఏపీకి తరలిస్తున్నరు !

మల్కాజిగిరి, వెలుగు: నగరంలో 108 అంబులెన్స్ సేవలు ‘దారి తప్పుతున్నాయి’. స్థానికంగా ఎమర్జెన్సీలో పేషెంట్లకు అందుబాటులో ఉండాల్సిన అంబులెన్సులను ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నారు. 

శనివారం నిజాంపేటలోని ఒక ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్న ఓ పేషెంట్​ను కుషాయిగూడకు చెందిన108 అంబులెన్స్ ద్వారా రాజమండ్రికి తరలించినట్టు సమాచారం. ఈ ఘటనపై మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా 108 అంబులెన్స్ ఇన్​చార్జి తిరుపతి వివరణ కోరగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే పేషెంట్‌‌ను తరలించినట్లు తెలిపారు.