టెన్త్​ ర్యాంకర్లకు గవర్నర్ సన్మానం

టెన్త్​ ర్యాంకర్లకు గవర్నర్ సన్మానం

హైదరాబాద్, వెలుగు: రాజ్ భవన్ స్కూల్ లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలో టాప్ ర్యాంకర్లుగా వచ్చిన స్టూడెంట్లను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సన్మానించారు.  సోమవారం రాజ్ భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ స్కూల్ లో పదో తరగతి పరీక్షల్లో 97 శాతం మంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు.  21 మంది స్టూడెంట్లకు 500 కంటే ఎక్కువ మార్కులు వచ్చినట్టు రాజ్ భవన్ ప్రెస్ సెక్రటరీ పత్రిక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో టాప్ మార్కులు సాధించిన హాసిని (574)తో పాటు మొత్తం 21 మందిని గవర్నర్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ర్యాంకర్లను గవర్నర్ అభినందించారు.