తిరుపతి వెంకన్న బంగారం 10 వేల కిలోలు

తిరుపతి వెంకన్న బంగారం 10 వేల కిలోలు

హైదరాబాద్, వెలుగు : తిరుమల వెంకటేశ్వర స్వామి ఆస్తులపై టీటీడీ శనివారం శ్వేతపత్రం విడుదల చేసింది. శ్రీవారికి 10,258 కిలోల బంగారంతోపాటు వివిధ బ్యాంకుల్లో రూ.15,938 కోట్ల నగదు ఉందని తెలిపింది. గత మూడేండ్లలో వెంకటేశ్వర స్వామి నగదు డిపాజిట్లు భారీగా పెరిగాయని టీటీడీ వెల్లడించింది.

2019 జూన్ నాటికి రూ.13,025 కోట్లుగా ఉన్న డిపాజిట్లు.. ప్రస్తుతం రూ.15,938 కోట్లకు చేరాయని పేర్కొంది. 2019 జూన్ నాటికి 7,339.74 కిలోల బంగారం నిల్వలు ఉండ గా.. అది ఇప్పుడు 10,258.37కు చేరిందని తెలిపింది. స్వామి వారి బంగారాన్ని కూడా వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. ఎస్​బీఐ లో 9,819.38 కిలోలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 438.99 కిలోల బంగారాన్ని డిపాజిట్​ చేశారు. డిపాజిట్లను సెక్యూరిటీల్లో పెట్టుబడులుగా పెడుతున్నారంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని టీటీడీ తెలిపింది.