ఏపీలో ఫుడ్ పాయిజన్ కలకలం... బజ్జీలు తిని 11 మందికి తీవ్ర అస్వస్థత..

ఏపీలో ఫుడ్ పాయిజన్ కలకలం... బజ్జీలు తిని 11 మందికి తీవ్ర అస్వస్థత..

ఏపీలో పశ్చిమగోదావరి జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. బజ్జీలు తిని 11 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం మండలం ఎస్ కొండెపాడులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఎస్ కొండెపాడులో ఆక్వా చెరువుల దగ్గర కూలీగా పనిచేస్తున్న బెంగాల్ కు చెందిన యువకుడు అదే గ్రామానికి చెందిన మేకపట్ల శ్రీనుకు మైదా పిండి ఇచ్చాడు. ఆ పిండితో చేసిన బజ్జీలు తిన్న 11 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

నిల్వ ఉంచిన మైదా పిండితో చేసిన బజ్జీలు తినడంతో ఫుడ్ పాయిజన్ అయినట్లు సమాచారం. బాధితులకు వాంతులు విరేచనాలు అవుతుండటంతో భీమవరంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బజ్జీలు తిన్న వెంటనే వాంతులు విరేచనాలు అయ్యి అపస్మారక స్థితిలోకి వెళ్లారు బాధితులు. చికిత్స అనంతరం బాధితులు కోలుకుంటున్నట్లు సమాచారం.

భీమవరం ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారి వివరాలు:

నక్కా కాసులమ్మ
ఈది సుజాత 
కొండోటి ధనమ్మ
పచ్చ వెంకటలక్షి
పచ్చ దీపిక
మోకమట్ల శ్రీను
మోకమట్ల దుర్గ 
మోకమట్ల కన్నయ
మోకమట్లసరస్వతి
తోట సుబ్బలక్షి
తోట సత్యనారాయణ