గండిపేట, వెలుగు: వివిధ రాష్ట్రాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రావాల్సిన 58 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన మరో 54 ఇండిగో విమానాలు సైతం రద్దు చేసినట్లు ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా 112 ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో ఇబ్బందులు పడుతున్నారు.

