శివాజీ, లయ జంటగా సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించిన చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. శివాజీ నిర్మించారు. బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు.
మార్చి 6న సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు సుధీర్ శ్రీరామ్ మాట్లాడుతూ ‘ఇదొక క్రైమ్ కామెడీ మూవీ. తమిళ దర్శకుడు నెల్సన్ తీసిన కో..కో..కోకిల, డాక్టర్ సినిమాల తరహాలో డార్క్ కామెడీ జానర్‌లో ఉంటుంది. ఫన్‌తో పాటు ఎమోషన్ ఉంటుంది. ఒక మంచి ఎంటర్‌టైనర్ చూసిన అనుభూతి కలుగుతుంది.
శివాజీ గారి వల్ల ఈ సినిమా స్థాయి పెరిగింది. ఆయనకు ఈ కథ చెప్పగానే తానే నిర్మిస్తానన్నారు. అయితే ఈటీవీ విన్ టీమ్‌కు కూడా కథ చెప్పమన్నారు. నిజానికి ఈ కథ మొదట చెప్పింది అక్కడే.. కానీ వ్యక్తులు వేరు.
ఈసారి ఓకే అయింది. శ్రీరామ్ పాత్రకు శివాజీ గారు పర్ఫెక్ట్‌గా కుదిరారు. టైటిల్ కూడా ఆయనే సజెస్ట్ చేశారు. దీనికి మొదట అనుకున్న టైటిల్ ‘అంతా బ్రాంతియేనా’. కామెడీ సినిమానే అయినా ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్. అందుకే ప్రతి సీన్‌కు, పాత్రకు లాజిక్ మిస్ అవకుండా కేర్ తీసుకున్నా. సినిమా మొదలైన 20 నిమిషాల తరువాత మరో కోణంలోకి వెళుతుంది.
ఫస్ట్ హాప్ హిలేరియస్‌గా ఉంటే.. సెకెండ్ హాఫ్ క్రైమ్‌లోకి వెళ్లి థ్రిల్ చేస్తుంది. కచ్చితంగా ఫ్యామిలీ అంతా థియేటర్స్‌లో ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఇక నేను ఒకే జానర్‌కు పరిమితం అవాలనుకోవడం లేదు. నాలుగు డిఫరెంట్ జానర్ స్టోరీస్ రెడీగా ఉన్నాయి” అని చెప్పాడు.
Get Ready to witness their fights, love, chemistry and much more madness in #SampradayiniSuppiniSuddapoosani 💥
— Sivaji (@ActorSivaji) March 2, 2026
Release Trailer
▶️ https://t.co/HVFDYXiIpC
From the Victorious Trio @etvwin, @TheBunnyVas & @connect2vamsi 💥
A #ETVWin original Production #SSS #SSSonMarch6th… pic.twitter.com/mwmSHVSlJJ
