చిల్డ్రన్స్ డే రోజే దారుణం..10 నిమిషాల ఆలస్యం..100 గుంజీలు.. బాలిక మృతి

చిల్డ్రన్స్ డే రోజే దారుణం..10 నిమిషాల ఆలస్యం..100 గుంజీలు.. బాలిక మృతి
  • మహారాష్ట్ర స్కూలులో బాలిక మృతి

స్కూల్​కు 10 నిమిషాలు లేట్ వచ్చినందుకు పనిష్మెంట్ కింద టీచర్  100 గుంజీలు తీయించడంతో  12 ఏండ్ల బాలిక తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని వసాయిలో చిల్డ్రన్స్ డే రోజే జరిగింది.

వసాయి(మహారాష్ట్ర): స్కూల్​కు 10 నిమిషాలు లేట్ వచ్చినందుకు పనిష్మెంట్ కింద 100 గుంజీలు తీయాలని టీచర్ బలవంతం చేసింది. దీంతో 12 ఏండ్ల బాలిక తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని వసాయిలో చోటుచేసుకుంది. 

వసాయిలోని శ్రీ హనుమంత్ విద్యామందిర్​ హైస్కూల్​లో కాజల్ గోండ్ 6వ తరగతి చదువుతోంది. శుక్రవారం చిల్డ్రన్స్ డే సందర్భంగా స్కూల్​లో ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. కాజల్ స్కూల్​కు 10 నిమిషాలు లేట్​గా వచ్చింది. దీంతో టీచర్ ఆమెకు పనిష్మెంట్ ఇచ్చింది. బ్యాగు వేసుకుని 100 గుంజీలు తీయాలని బలవంతం చేసింది. గుంజీలు తీసిన తర్వాత ఇంటికి చేరుకున్న కాజల్ అస్వస్థతకు గురైంది. 

దీంతో కాజల్​ను ఆమె పేరెంట్స్ జేజే హాస్పిటల్​కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం చనిపోయింది. గుంజీలు తీయించడం వల్లే తమ కూతురు చనిపోయిందంటూ మృతురాలి బంధువులు స్కూల్ ముందు ధర్నాకు దిగారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.