టీమిండియాకు రూ. 125 కోట్ల నజరానా

టీమిండియాకు రూ. 125 కోట్ల నజరానా

న్యూఢిల్లీ : రెండోసారి టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ నెగ్గిన టీమిండియాపై కోట్ల వర్షం కురిసింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి బీసీసీఐ రూ. 125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. ఈ మేరకు సెక్రటరీ జై షా ఎక్స్‌‌‌‌ వేదికగా ప్రకటించాడు. టైటిల్‌‌‌‌ నెగ్గినందుకు ఐసీసీ ఇచ్చే ప్రైజ్‌‌‌‌మనీ (రూ. 20.4 కోట్లు) దీనికి అదనం. ఓవరాల్‌‌‌‌గా ప్రైజ్‌‌‌‌మనీకి ఆరు వందల రెట్లు అధికంగా క్యాష్‌‌‌‌ రివార్డును ప్రకటించిన బీసీసీఐ ఒక్కసారిగా అందర్ని ఆశ్చర్యంలో పడేసింది.

ఈ మొత్తాన్ని ప్లేయర్లు, కోచింగ్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌, సపోర్ట్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌కు పంచనున్నారు. ‘రోహిత్‌‌‌‌ నాయకత్వంలో టీమ్‌‌‌‌ అసాధారణమైన ప్రతిభను చూపెట్టింది. టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ హిస్టరీలో టోర్నీని అజేయంగా ముగించిన తొలి టీమ్‌‌‌‌గా టీమిండియా నిలిచింది. ట్రోఫీ గెలవడం మనకు స్ఫూర్తిదాయకం. ప్లేయర్లు తమ అంకితాభావంతో 1.4 బిలియన్ల ఇండియన్స్‌‌‌‌ కలను నెరవేర్చారు’ అని జై షా వ్యాఖ్యానించాడు.